కార్గో సేవల్లో తణుకు హ్యాట్రిక్
తణుకు అర్బన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిర్వహించిన కార్గో పార్సిల్స్ అండ్ కొరియర్ డోర్ డెలివరీ మాసోత్సవాల్లో తణుకు ఆర్టీసీ డిపో రీజియన్‌లో మొదటి స్థానంలో నిలిచింది. గతనెల 20 నుంచి ఈనెల 19వ తేదీ వరకు నిర్వహించిన మాసోత్సవాల్లో భాగంగా తణుకు డిపో మొదటి స్థానంలో నిలిచి సత్తాచాటింది. రీజియన్‌లోని 4 డిపోల ఆవరణల్లో ఉన్న కార్గో కేంద్రాలతోపాటు 5 పట్టణాల్లోని కార్గో ఏజెంట్ పాయింట్ల ద్వారా డోర్ డెలివరీ సేవలు అందుతున్నాయి. తణుకులో మాసోత్సవాల్లో వినియోగదారులను ఆకర్షించే రీతిలో డోర్ డెలివరీలకు సంబంధించి లక్కీ డిప్‌ల ద్వారా ప్రత్యేకమైన బహుమతులను అందజేశారు. డోర్ డెలివరీ మాసోత్సవాలకు సంబంధించి ప్రచారాలు, అవగాహన ర్యాలీలు నిర్వహించారు. వరుసగా మూడో సంవత్సరం కూడా తణుకు డిపోలోని కార్గో కేంద్రం మొదటి స్థానంలో నిలిచి హాట్రిక్ సాధించడంతో సిబ్బంది సంబరాలు చేసుకుంటున్నారు.
మాసోత్సవంలో పార్సిల్ బుకింగ్స్
డిపో లక్ష్యం బుకింగ్స్ గ్రోత్ శాతం
తణుకు 3,007 5,986 199.07
తాడేపల్లిగూడెం 2,511 3,659 145.72
నరసాపురం 2,511 3009 119.83
భీమవరం 3,503 4,101 117.07
199.07 శాతం గ్రోత్‌తో ఈ ఏడాది కూడా మొదటి స్థానం
గత రెండేళ్లుగా కూడా తణుకు డిపోనే ఫస్ట్
ముగిసిన డోర్ డెలివరీ మాసోత్సవాలు


