పట్టిసం ఉత్సవాల ఏర్పాట్ల పరిశీలన
సస్యరక్షణతో అధిక దిగుబడులు
రైతులు మామిడి తోటల్లో సస్యరక్షణ చర్యలను చేపట్టడం ద్వారా నాణ్యమైన అధిక దిగుబడులు సాధించవ్చని ఉద్యాన అధికారులు సూచిస్తున్నారు. 8లో u
పోలవరం రూరల్: పట్టిసం మహాశివరాత్రి ఉత్సవాలలో సామాన్య భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. మహాశివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 15న పట్టిసీమలో జరిగే మహాశివరాత్రి ఉత్సవాలు నిర్వహణ ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడతో కలిసి బుధవారం పట్టిసం రివర్ ఇన్‌లో సమీక్షించారు. క్యూలైన్లలో భక్తులు ఎక్కువసేపు వేచి ఉండకుండా త్వరితగతిన దర్శనం కలిగేలా క్యూలైన్లు నిర్వహించాలన్నారు. ఆలయం వద్ద, ప్రధాన రహదారుల్లో రాకపోకలకు అంతరాయం కలగకుండా, తొక్కిసలాట జరగకుండా ట్రాఫిక్ నియంత్రణ, బారికేడ్ల ఏర్పాటు చేపట్టాలన్నారు. భక్తుల రద్దీకి తగ్గట్టుగా సీసీ కెమెరాలు, డ్రోన్ల ద్వారా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలన్నారు. తాగునీరు, ప్రథమ చికిత్స శిబిరాలు, ముఖ్యంగా గోదావరి వద్ద అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన రక్షణ ఏర్పాట్లు చేపట్టాలన్నారు. నదిని దాటించే సమయంలో ఫెర్రీ వద్ద ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నది వెంట 108 వాహనాలు, వైద్య కేంద్రాలు, మోటారు బోట్లు, గత ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలన్నారు. ఏఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, ఆర్డీఓ ఎంవీ.రమణ, ఐటీడీఏ పీవో కె.రాములు నాయక్ తదితరులు పాల్గొన్నారు.


