నేరాల నియంత్రణపై దృష్టి | - | Sakshi
Sakshi News home page

నేరాల నియంత్రణపై దృష్టి

Feb 22 2026 8:08 AM | Updated on Feb 22 2026 8:08 AM

నేరాల నియంత్రణపై దృష్టి

నేరాల నియంత్రణపై దృష్టి

నేరాల నియంత్రణపై దృష్టి

ఐజీ అశోక్‌కుమార్‌

పెనుగొండ: నేర నియంత్రణలో పోలీసులు చురు గ్గా పనిచేస్తున్నారని ఏలూరు రేంజ్‌ ఐజీ అశోక్‌కు మార్‌ అన్నారు. శనివారం ఆచంట పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్‌ ఆవరణలో మొక్కలు నాటారు. కేసుల వివరాలు, క్రైం రేటు, నమోదులపై ఆరా తీశారు. గంజాయి అక్రమ రవాణా నివారణ, మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి సా రించినట్టు చెప్పారు. రహదారి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. జాతీయ రహదారిలో ప్రమాదాలకు అవకాశం ఉన్న 23 బ్లాక్‌ స్పాట్‌లను గుర్తించామన్నారు. నరసాపురం పట్టణం, పెంటపాడు, తణుకు, తాడేపల్లిగూడెంలో బ్లాక్‌ స్పాట్‌లు ఉన్నాయన్నారు. హైవే అధికారులతో చర్చించి ఆయా ప్రాంతాల్లో ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటామన్నారు. తణుకు, భీమవరం స్టేషన్లను మోడల్‌ పోలీస్‌స్టేషన్లుగా అభివృద్ధి చేస్తున్నట్టు చెప్పారు. పశ్చిమగోవదావరి జిల్లా ఎస్పీ నయీం అస్మి, ఏఎస్పీ భీమారావు, డీఎస్పీ డాక్టర్‌ శ్రీవేద, సీఐ రాయుడు విజయకుమార్‌, సిబ్బంది ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement