పరిశుభ్రత.. సామాజిక బాధ్యత | - | Sakshi
Sakshi News home page

పరిశుభ్రత.. సామాజిక బాధ్యత

Feb 22 2026 8:08 AM | Updated on Feb 22 2026 8:08 AM

పరిశుభ్రత.. సామాజిక బాధ్యత

పరిశుభ్రత.. సామాజిక బాధ్యత

పరిశుభ్రత.. సామాజిక బాధ్యత ముగిసిన సీఆర్‌ఈ శిక్షణ 24న సైక్లింగ్‌ సెలెక్షన్స్‌ కేంద్ర పథకాల నిధులు వినియోగించాలి రహదారుల పనులపై సమీక్ష

ఏలూరు (టూటౌన్‌): వ్యక్తిగత, పరిసరాల శుభ్రతను ప్రతిఒక్కరూ సామాజిక బాధ్యతగా స్వీకరించాలని కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి పిలుపునిచ్చారు. స్థానిక తంగెళ్లమూడి 1వ వార్డు సచివాలయం వద్ద, 27, 28వ డివిజన్ల పరిధిలో ఎఫ్‌సీఐ గోడౌన్లు ఏటిగట్టు ప్రాంతంలో శనివారం స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ–వేస్ట్‌ సేకరణ థీమ్‌ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి), మేయర్‌ షేక్‌ నూర్జహాన్‌, ఆర్టీసీ విజయవాడ–2 చైర్మన్‌ రెడ్డి అప్పలనాయుడు, డీఆర్వో వి.విశ్వేశ్వరరావు, ఆర్డీఓ ఎం.అచ్యుత అంబరీష్‌, ఏలూరు ఉడా చైర్మన్‌ పెద్దిబోయిన శివ ప్రసాద్‌ పాల్గొన్నారు.

ఏలూరు (టూటౌన్‌): స్థానిక ఉమా కాలేజ్‌ ఆఫ్‌ స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ వేదికగా మూడు రోజులుగా జరుగుతున్న స్టేట్‌ లెవల్‌ కంటిన్యూ రిహాబిలిటేషన్‌ ఎడ్యుకేషన్‌ (సీఆర్‌ఈ) శిక్షణా కార్యక్రమం శనివారం ముగిసింది. ముఖ్య అతిథులుగా విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల శాఖ సహాయ సంచాలకుడు బి.రామ్‌కుమార్‌, సర్వ శిక్ష అభియాన్‌ ఏపీసీ కె.పంకజ్‌కుమార్‌ హాజరయ్యారు. పంకజ్‌కుమార్‌ మాట్లాడుతూ ఆధునిక పద్ధతులు ఉపయోగించి దైనందిన జీవితాన్ని ఎలా ప్రభావితం చేసుకోవాలనే విషయాలను వివరించారు. రామ్‌కుమార్‌ మాట్లా డుతూ స్మార్ట్‌ హియరింగ్‌ ఎయిడ్స్‌, స్పీచ్‌–టు–టెక్ట్స్‌ సాఫ్ట్‌వేర్లు, ఏఐ యాప్‌ల ద్వారా దివ్యాంగులు స్వయంగా పనులు చేసుకునేలా తీర్చిదిద్దవచ్చన్నారు. సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఎస్‌.పెద్దిరెడ్డి మాట్లాడుతూ స్పెషల్‌ ఎడ్యుకేటర్లు కేవలం సంప్రదాయ పద్ధతులకే పరిమి తం కాకుండా విజువల్‌ లెర్నింగ్‌ టూల్స్‌, ఇంటరాక్టివ్‌ సాఫ్ట్‌వేర్‌లను బోధనలో భాగం చే యాలని సూచించారు. అనంతరం శిక్షణలో పా ల్గొన్న వారికి సర్టిఫికెట్లు అందించారు. కో–ఆర్డినేటర్‌ డి.శ్రీనివాస్‌రెడ్డి, నెల్లూరు బృందం, ఉమా కాలేజ్‌ ప్రతినిధులు, స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ నిపుణులు పాల్గొన్నారు.

ఏలూరు రూరల్‌: రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 24న జిల్లాస్థాయి సైక్లింగ్‌ పోటీలు నిర్వహించనున్నట్టు డీఎస్‌డీఓ ఎస్‌ఏ అజీజ్‌ ప్రకటనలో తెలిపారు. ఏలూరు ఇండోర్‌స్టేడియంలో ఉదయం 9 గంటలకు పోటీలు ప్రారంభమవుతాయని, 18 ఏళ్ల వయసున్న పు రుషులు, మహిళలు పాల్గొనవచ్చన్నారు. ప్ర తిభ చాటిన వారిని జిల్లా జట్లకు ఎంపిక చేస్తామని, వీరు ఈనెల 28 నుంచి విజయవాడలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ప్రాతినిధ్యం వహిస్తారన్నారు. శాప్‌ వెబ్‌సైట్‌లో పేర్లు నమోదు చేసుకోవాలని, మరిన్ని వివరాలకు కోచ్‌ షేక్‌ ఖాసీం 9492701324 నంబర్‌లో సంప్రదించాలని ఆయన కోరారు.

భీమవరం (ప్రకాశంచౌక్‌): జిల్లాకు కేటాయించిన కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులను నూరు శాతం వినియోగించాలని కలెక్టర్‌ సీహెచ్‌ నాగరాణి ఆదేశించారు. కలెక్టరేట్‌లో శనివారం సర్వే, వైద్యం, వ్యవసాయం, విద్య, పంచాయ తీరాజ్‌, ఐసీడీఎస్‌, ఉద్యాన శాఖల అధికారులతో ఆమె సమావేశమయ్యారు. జిల్లాకు కేటాయించిన కేంద్ర ప్రాయోజిత పథకాల నిధుల వినియోగంపై సమీక్షించారు. శాఖల వారీగా నిధుల మంజూరు, ఖర్చు, పనుల పురోగతి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ నిధుల వినియోగానికి నెల మాత్రమే గడువు ఉందని, ఈలోపు నూరు శాతం సద్వినియోగం చేయాలన్నారు. ఇబ్బందులుంటే తన దృష్టికి తీసుకురావాలని కోరారు. కేంద్రం నుంచి 60:40, 90:10 నిష్పత్తులో నిధులు మంజూరు చేస్తారన్నారు.

భీమవరం(ప్రకాశంచౌక్‌): నరసాపురం పార్లమెంట్‌ పరిధిలోని జాతీయ రహదారులు, ఆర్‌అండ్‌బీ రోడ్ల అభివృద్ధిపై కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తన క్యాంపు కార్యా లయంలో శనివారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర రవాణా, ఆర్‌ అండ్‌బీ శాఖల స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ కృష్ణబాబు, రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ విజయవాడ రీజనల్‌ ఆఫీసర్‌ హరికృష్ణ, కలెక్టర్‌ నాగరాణి, జేసీ రాహుల్‌కుమార్‌రెడ్డి, ఆర్‌అండ్‌ బీ ఎస్‌ఈ విజయరత్న హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement