అడ్డగోలుగా అసైన్డ్ దందా
న్యూస్‌రీల్
కోర్టు విచారణలో ఉండగానే మ్యుటేషన్ చేశారు
సహకార ఉద్యోగుల ధర్నా
సమస్యల పరిష్కారం కోసం సహకార పరపతి సంఘాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు చేపట్టిన సమ్మె కొనసాగుతోంది. ఆందోళన ఆరో రోజుకు చేరింది. 8లో u
ప్రభుత్వం పేదలకు అందించిన భూములు అక్రమార్కుల పాలవుతున్నాయి. పేదవాడి ఆకలి తీర్చడం కోసం ప్రభుత్వం ఇచ్చిన అసైన్‌మెంట్ (అసైన్డ్) భూములు ఇప్పుడు భూబకాసురులకు వరంగా మారాయి. చింతలపూడి మండలంలోని పలు గ్రామాల్లో ఈ భూముల కొనుగోలు, అమ్మకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. చట్టప్రకారం ఈ భూములను అమ్మడం గానీ, కొనడం గానీ నేరం అని తెలిసినా.. రెవెన్యూ అధికారుల సహకారంతోరికార్డులు క్షణాల్లో మారిపోతున్నాయని బాఽధితులు ఆరోపిస్తున్నారు.
ఆదివారం శ్రీ 22 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
చింతలపూడి: అసైన్డ్ భూముల బదిలీ నిరోధక చట్టం (పీఓటీ) యాక్ట్ ప్రకారం.. ప్రభుత్వం నుంచి పట్టా పొందిన భూమిని ఎవరికీ విక్రయించకూడదు. ఒక వేళ విక్రయించినా, ఆ భూమిని వేరొకరి పేరు మీ దకు మార్చే (మ్యుటేషన్) అధికారం అధికారులకు లేదు. అయితే చింతలపూడి మండలంలో సీన్ రివర్స్ అవుతోంది. వేలాది ఎకరాల అసైన్‌మెంట్ భూములు ఇప్పటికే ప్రైవేటు వ్యక్తుల పేర్లపైకి మారిపోయాయని ఎన్‌జీఓ సోషల్ సర్వీస్ అసోసియేషన్ అధ్యక్షుడు తుల్లిమెల్లి కుటుంబరావు తెలిపారు. ముడుపుల మత్తులో ఉన్న కొందరు అధికారులు, రెవెన్యూ సిబ్బంది కనీసం క్షేత్రస్థాయి పరిశీలన కూడా చేయకుండానే ఆన్‌లైన్ రికార్డులను తారుమారు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. చాలాకాలంగా ఈ వ్యవహారం సాగుతోందని బాధితులు ఆరోపిస్తున్నారు.
కోర్టుల్లో కేసులున్నా..
కొన్ని భూములు కోర్టు వివాదాల్లో ఉన్నా రెవెన్యూ యంత్రాంగం ఆ విషయాన్ని పక్కన పెట్టి మరీ రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు చేసేస్తోంది. ‘అమ్ముతున్నారు కాబట్టి కొంటున్నాం.. అధికారులు రికార్డులు మార్చి ఇస్తుంటే మీకేంటి బాధ?’ అంటూ కొనుగోలుదారులు ఎదురు ప్రశ్నిస్తుండటం చూస్తుంటే.. అక్రమాలకు ఏ స్థాయిలో అధికారుల అండదండలు ఉన్నాయో అర్థమవుతోంది. పేద రైతుల ఆర్థిక ఇబ్బందులను ఆసరాగా చేసుకుని దళారులు తక్కువ ధరకు భూములను చేజిక్కించుకుంటున్నారు. పెద్ద మొత్తంలో నగదు చేతులు మారగానే, నిబంధనలకు విరుద్ధంగా రికార్డుల్లో పట్టా భూములుగా మార్చేస్తున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపించడంతో కిందిస్థాయి సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఒకవేళ ప్రజా ఫిర్యాదుల విభాగంలో నేరుగా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన సందర్భంలో కిందిస్థాయి అధికారులను విచారణకు ఆదేశిస్తున్నారు. వారు తూతూమంత్రంగా విచారణ జరిపి సమస్య పరిష్కారం అయ్యింది అని చెప్పి ఫిర్యాదుదారుడికి మెసేజ్ పంపించి చేతులు దులుపుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అన్ని ఆధారాలతో సీఎంఓ కార్యాలయానికి ఫిర్యాదు పంపించినా ఇదే పరిస్థితి ఎదురవుతుందని లబ్ధిదారులు వాపోతున్నారు.
ప్రభుత్వ విచారణ జరిగేనా?
చట్టాన్ని తుంగలో తొక్కి సాగుతున్న ఈ భూ దందాపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని స్థానికులు కోరుతున్నారు. సమగ్ర విచారణ జరిపి, అక్రమంగా జరిగిన మ్యుటేషన్లను రద్దు చేయడంతో పాటు అసలైన లబ్ధిదారులకు ఆ భూములను తిరిగి అప్పగించడంతో పాటు అవినీతికి పాల్పడిన రెవెన్యూ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే రాబోయే కాలంలో పేదలకు సాగుభూమి అనేది కలగానే మిగిలిపోయే ప్రమాదం ఉందని అంటున్నారు.
ఈ చిత్రంలో కనిపిస్తున్న మహిళ పేరుముస్సే దుర్గమ్మ. చింతలపూడి మండలం, రామకృష్ణాపురం (మెతుకుమెల్లిగూడెం) గ్రామం. దుర్గమ్మకు గ్రామంలో సర్వే నం.455/6లో 75 సెంట్ల భూమి ఉంది. 1985లో ప్రభుత్వం దుర్గమ్మకు సాగుపట్టా ఇచ్చింది. ఆమె యర్రగుంటపల్లి కెనరా బ్యాంక్‌లో క్రాప్ లోన్లు కూడా తీసుకున్నారు. అయితే దుర్గమ్మకు చెందిన భూమిని రెవెన్యూ అఽధికారులు అడ్డగోలుగా ఇతరుల పేరుపై మ్యుటేషన్ చేయడంతో సదరు భూమిని ఆక్రమించుకున్న వ్యక్తులు దుర్గమ్మ కుటుంబాన్ని భూమిలోకి అడుగుపెట్టకుండా అడ్డుకుని భూమిని స్వాధీనం చేసుకున్నారు. దీంతో దుర్గమ్మ అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోకపోవడంతో హైకోర్టును ఆశ్రయించింది. తన భూమిని తిరిగి తన పేరున మార్చి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తోంది.
చింతలపూడిలో భూచోళ్లు
పేదల భూములపై అక్రమార్కుల కన్ను
రెవెన్యూ అధికారుల అండతో భూ బదలాయింపు!
ముడుపులకు ఆశపడి రికార్డుల తారుమారు
కోర్టు పరిధిలోని భూములకు మ్యుటేషన్లు
అధికారుల తీరుపై విమర్శలు
అన్ని ఆధారాలు ఉన్నా మాకు చెందిన భూమిని ఆన్‌లైన్‌లో పేర్లు మార్చేశారు. మా అమ్మమ్మ నుంచి మా అమ్మకు సంక్రమించిన సుమారు 2.5 ఎకరాల భూమిని కోర్టు విచారణలో ఉండగానే మాకు తెలియకుండా మ్యుటేషన్ చేశారు. సాగు చేసుకుంటున్న మమ్మల్ని బయటకు నెట్టి ఆక్రమించుకున్నారు. మేం తహసీల్దార్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో హైకోర్టులో కేసు వేశాం.
– కాకర్ల శ్రీను, బాధితుడు, యర్రగుంటపల్లి
అడ్డగోలుగా అసైన్డ్ దందా
అడ్డగోలుగా అసైన్డ్ దందా
అడ్డగోలుగా అసైన్డ్ దందా


