శ్రీశైలం మల్లన్నకు శ్రీవారి దేవస్థానం పట్టువస్త్రాలు | - | Sakshi
Sakshi News home page

శ్రీశైలం మల్లన్నకు శ్రీవారి దేవస్థానం పట్టువస్త్రాలు

Feb 11 2026 7:43 AM | Updated on Feb 11 2026 7:43 AM

శ్రీశ

శ్రీశైలం మల్లన్నకు శ్రీవారి దేవస్థానం పట్టువస్త్రాలు

శ్రీశైలం మల్లన్నకు శ్రీవారి దేవస్థానం పట్టువస్త్రాలు పశువుల కొవ్వు నుంచి నూనె తీస్తున్న వ్యక్తి అరెస్టు ఆయుధ డిపో నిర్మించి తీరుతాం

ద్వారకాతిరుమల: శ్రీశైలం శ్రీ మల్లిఖార్జున స్వామివారికి ద్వారకాతిరుమల చినవెంకన్న దేవస్థానం అధికారులు సోమవారం రాత్రి పట్టు వస్త్రాలను సమర్పించారు. శివరాత్రిని పురస్కరించుకుని మల్లన్నకు నిర్వహించే బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ వస్త్రాలను అందజేశారు. ముందుగా శ్రీవారి దేవస్థానం ఈఓ యర్రంశెట్టి భద్రాజీ, ఏఈఓ పి.నటరాజారావు పట్టు వస్త్రాలను శిరస్సుపై పెట్టుకుని అర్చకులు, పండితుల వేద మంత్రోచ్ఛరణల నడుమ మల్లన్న సన్నిధికి చేరుకున్నారు. అనంతరం అక్కడి అధికారులకు వాటిని అందజేశారు. ఆ తరువాత మల్లన్నను దర్శించి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. ఏటా బ్రహ్మోత్సవాల్లో మల్లన్నకు చినవెంకన్న దేవస్థానం పట్టు వస్త్రాలను ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. ఈ కార్యక్రమంలో శ్రీవారి దేవస్థానం సూపరింటిండెంట్‌ హయగ్రీవాచార్యులు, ఆచారి తదితరులున్నారు.

నూజివీడు: పశువుల కొవ్వు నుంచి నూనెను తయారు చేస్తున్న వ్యక్తిని మంగళవారం పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకొని అతని వద్ద నుంచి 60 కిలోల గడ్డకట్టిన నూనెను స్వాధీనం చేసుకున్నారు. పట్టణ ఎస్సై నాగేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని అజరయ్యపేటకు చెందిన కంచిపోగు అజయ్‌ అలియాస్‌ మస్తాన్‌ గత 20 ఏళ్లకు పైగా పశువులను కోసి మాంసాన్ని విక్రయిస్తూ ఉంటాడు. అంతేగాకుండా పశువుల కొవ్వును కరిగించి నూనెను తయారు చేసి విక్రయిస్తూ ఉంటాడు. దీంతో పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు ఉదయం 7గంటల సమయంలో ఎస్సై తన సిబ్బందితో వెళ్లి అతడిని అదుపులోకి తీసుకోవడంతో పాటు గడ్డకట్టి ఉన్న నూనె టిన్నులను, కొవ్వు మాంసాన్ని స్వాధీనం చేసుకొని స్టేషన్‌కు తరలించారు. మాంసం కొవ్వునుంచి నూనె తయారు చేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కొయ్యలగూడెం: నేవీ ఆయుధ డిపో నిర్మాణానికి ఎన్ని అడ్డంకులు వచ్చినా నిర్మాణ ప్రక్రియ పూర్తి చేసి తీరుతామని ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పేర్కొన్నారు. మంగళవారం సరిపల్లి గ్రామంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ నేవీ డిపో నిర్మాణాన్ని అడ్డుకోవడానికి కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని అన్నారు. ఆయుధ డిపో నిర్మాణాన్ని అడ్డుకోవాలని చూస్తే ఎందాకై నా వెళ్లడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఎంపీ పుట్టా మహేష్‌యాదవ్‌, తానూ ఆయుధ డిపో నిర్మాణంలో కృత నిశ్చయంతో ఉన్నామన్నారు. చోడి పిండి సుబ్రహ్మణ్యం, ఏఎంసీ మాజీ చైర్మన్‌ పారేపల్లి రామారావు తదితరులు పాల్గొన్నారు.

శ్రీశైలం మల్లన్నకు శ్రీవారి దేవస్థానం పట్టువస్త్రాలు 1
1/2

శ్రీశైలం మల్లన్నకు శ్రీవారి దేవస్థానం పట్టువస్త్రాలు

శ్రీశైలం మల్లన్నకు శ్రీవారి దేవస్థానం పట్టువస్త్రాలు 2
2/2

శ్రీశైలం మల్లన్నకు శ్రీవారి దేవస్థానం పట్టువస్త్రాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement