రైతులకు మొండిచేయి | - | Sakshi
Sakshi News home page

రైతులకు మొండిచేయి

Feb 15 2026 7:30 AM | Updated on Feb 15 2026 7:30 AM

రైతుల

రైతులకు మొండిచేయి

రైతులకు మొండిచేయి నిండా ముంచారు మోసపూరిత బడ్జెట్‌ కౌలు రైతుల ఊసేది? ఇళ్లపై స్పష్టత లేదు పేదలకు నిరాశే ఉద్యోగులు, కార్మికులకు నిరాశే కార్మికుల సంక్షేమం పట్టదా ? 30 శాతం లోటు విద్యకు అరకొరగా.. ●

2026–27 రాష్ట్ర బడ్జెట్‌లో ప్రభుత్వం రైతులకు మొండిచేయి చూపించింది. కౌలురైతుల ఊసే ఎత్తలేదు. వ్యవసాయ రంగానికి ఆశించిన స్థాయిలో బడ్జెట్‌లో కేటాయింపులు లేవు. చింతలపూడి ఎత్తిపోతల పథకానికి నిధుల కేటాయింపు తక్కువగా ఉంది. పోలవరం నిర్వాసితుల గురించి ప్రస్తావనే లేదు.

– దూలం నాగేశ్వరరావు, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు

బడ్జెట్‌లో పోలవరం నిర్వాసితులకు ఎంత అనే స్పష్టత లేకపోవడం ద్వారా నిర్వాసితులను ముంచాలనుకున్నారని స్పష్టమవుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వాసితులను ముంచే పనిలోనే ఉన్నాయి. మహిళలకు నెలకు రూ.1,500, నిరుద్యోగ భృతి ప్రస్తావన లేకపోవడం ద్వారా హామీలను తుంగలో తొక్కారు.

– ఎ.రవి, సీపీఎం జిల్లా కార్యదర్శి

బడ్జెట్‌ ప్రజలను మభ్యపెట్టేదిగా, మోసపూరితంగా ఉంది. విద్యా, వైద్య రంగాల్లో కేటాయింపులు నామమాత్రంగా ఉన్నాయి. పోల వరం ప్రాజెక్టును 2027 పుష్కరాల నాటికి పూర్తి చేస్తామని ఆర్భాటపు ప్రకటనలు చేస్తున్నారు. బడ్జెట్‌ ఆద్యంతం ఆత్మస్తుతి పరనిందాగా ఉంది. పేదలకు మేలు చేయని బడ్జెట్‌.

– డేగా ప్రభాకర్‌, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యుడు

కౌలు రైతులకు మొండిచేయి చూ పారు. అన్నదాత సుఖీభవ సా యంపై స్పష్టత ఇవ్వలేదు. పంట నష్టపోయిన రైతులకు పంటల బీమా పరిహారం కేటాయింపు జరగలేదు. ధరలు పడిపోయి రైతులు నష్టపోతున్నా కనీసం మద్దతు ధరలు కూడా అందడం లేదు. కౌలు రైతులపై దయ లేదు.

– కె.శ్రీనివాస్‌, ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి

రాష్ట్ర బడ్జెట్‌ అంకెల గారడీగానే కనిపిస్తుంది. సూపర్‌సిక్స్‌ పథకా ల అమలుకు బడ్జెట్‌ కేటాయింపులు నోచుకోలేదు. ఇళ్ల స్థలాలు లేని పేదలకు గ్రామాల్లో మూడు సెంట్లు, పట్టణాల్లో రెండు సెంట్లు, ఇంటి నిర్మాణానికి రూ.4 లక్షలపై బడ్జెట్‌లో స్పష్టత లేదు. పా రిశ్రామికవేత్తలకు మేలు చేసేదిగా ఉంది.

– మన్నవ కృష్ణ చైతన్య, సీపీఐ జిల్లా కార్యదర్శి

గ్రామీణ పేదలు, రైతులకు నిరాశ ఎదురైంది. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, పోలవరం నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి బడ్జెట్‌లో ప్రాధాన్యమివ్వలేదు. జీ రాం జీ పథకంలో రాష్ట్ర వాటాపై స్పష్టత లేదు. సంక్షేమ పథకాలకు కూడా కేటాయింపులు అంతగా లేవు. పేద, మధ్య తరగతి ప్రజలకు మేలు జరగదు.

– బండి వెంకటేశ్వరరావు, బీకేఎంయు ప్రధాన కార్యదర్శి

బడ్జెట్‌ ఉద్యోగులు, కార్మికులను తీవ్రంగా నిరాశపరిచింది. లక్షల మంది అంగన్‌వాడీ, ఆశ, మ ధ్యాహ్నం భోజన పథకం కార్మి కుల వేతనాల గురించి ఏ మా త్రం ప్రస్తావించలేదు. అసంఘటిత రంగ కార్మికులకు వెల్ఫేర్‌ బోర్డుల గురించి పట్టించుకోలేదు. 12వ పీఆర్సి గురించి కనీసం మాట్లాడలేదు.

– డీఎన్‌వీడి ప్రసాద్‌, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి

బడ్జెట్‌లో కార్మిక సంక్షేమానికి ఎలాంటి కేటాయింపులు లేవు. మొత్తం రూ.3,22,205 కోట్ల బడ్జెట్‌లో కార్మిక సంక్షేమానికి ఎలాంటి కేటాయింపులు లేకపోవడం చాలా అన్యాయం. వ్యవసాయ, వైద్యం, మహిళా సంక్షేమానికి చాలా తక్కువగా నిధులు కేటాయించారు.

– పి.కిషోర్‌, ఏఐటీయూసీ నాయకుడు, ఏలూరు

మాటలు కోటలు దాటినా.. పద్దులు గడప దాటని విధంగా రాష్ట్ర బడ్జెట్‌ ఉంది. బడ్జెట్‌లో 30 శాతం లోటు ఉంది. పేదలకు ఏ మాత్రం ఉపయోగపడని బడ్జెట్‌ ఇది. 2027 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామన్న ప్రభుత్వం బడ్జెట్‌లో కేవలం రూ.6,105 కోట్లు మాత్రమే కేటాయించడం సరికాదు. ఎన్నడూ లేనివిధంగా ద్రవ్యలోటు ఉంది.

– పీవీ రామకృష్ణ,

జిల్లా ప్రధాన కార్యదర్శి, వ్య.కా.స, ఏలూరు

రాష్ట్ర బడ్జెట్‌లో విద్యారంగానికి అరకొరగా కేటాయింపులు చేయడం దారుణం. కనీసం 6 శాతం నిధులు కూటా విద్యారంగానికి కేటాయించక పోవడం శోచనీయం. ఈ నిధులతో సర్కారీ విద్యారంగం ఎలా అభివృద్ధి చెందుతుందో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి. కనీసం 15 శాతం అయినా నిధులు కేటాయించాలి.

– బి.రెడ్డిదొర, తాళ్లూరి రామారావు,

ఏపీటీఎఫ్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు

రైతులకు మొండిచేయి  
1
1/7

రైతులకు మొండిచేయి

రైతులకు మొండిచేయి  
2
2/7

రైతులకు మొండిచేయి

రైతులకు మొండిచేయి  
3
3/7

రైతులకు మొండిచేయి

రైతులకు మొండిచేయి  
4
4/7

రైతులకు మొండిచేయి

రైతులకు మొండిచేయి  
5
5/7

రైతులకు మొండిచేయి

రైతులకు మొండిచేయి  
6
6/7

రైతులకు మొండిచేయి

రైతులకు మొండిచేయి  
7
7/7

రైతులకు మొండిచేయి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement