ఫ్రీజర్ లేదు.. కావాలంటే తెచ్చుకోండి
● మృతదేహంపై ప్రభుత్వాస్పత్రి అధికారుల నిర్లక్ష్యం
● భీమవరంలో ఘటన
● దళితుడనే ఇంత నిర్లక్ష్యమా అంటూ కేవీపీఎస్ ఆగ్రహం
భీమవరం (ప్రకాశంచౌక్): చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని ఫ్రీజర్‌లో ఉంచాల్సి ఉండగా, తమ వద్ద అలాంటి సౌకర్యాలేమీ లేవని, కావాలంటే ఫ్రీజర్ తెచ్చుకోవాలని భీమవరం ప్రభుత్వాస్పత్రి వైద్యాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. వివరాలిలా ఉన్నాయి.. ఆదివారం అత్తిలి మండలం వరిఘేడుకి చెందిన కన్నెపా ముల రాంబాబు (49) భీమవరం అంబేడ్కర్ సెంటర్‌లో సొంత ఆటోలో కూర్చొని ఉండగా ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో భీమవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి ఫిట్స్ ద్వారా మృతిచెందినట్టు నిర్ధారించారు. టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశా రు. పోస్టుమార్టం చేసి మృతదేహాన్ని అప్పగిస్తా మని వైద్యులు తెలిపారని, అయితే మృతదేహా న్ని ఫ్రీజర్‌లో పెట్టకుండా బయటే వదిలేశారని కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. ఆస్పత్రిలో ఫ్రీజర్ లేదని, అలాంటి సౌకర్యాలు ఇ క్కడ లేవని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బాడీని ఇవ్వకుండా.. ఫ్రీజర్‌లో పెట్టకుండా..
దళిత వ్యక్తి మృతదేహం పట్ల భీమవరం ప్రభు త్వ ఆసుపత్రి అధికారులు, సిబ్బంది తీరు దారుణమని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.క్రాంతి బాబు అన్నారు. జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో మార్చురీలో ఫ్రీజర్ లేకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. మృతదేహాన్ని ఫ్రీజర్‌లో పెట్టకుండా బయటే పెట్టడంతో బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. కనీసం బాడీని తమకు అప్పగించండని వేడుకుంటున్నా ఇవ్వకుండా.. అటు ఫ్రీజర్‌లో పెట్టకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. జిల్లా అధికారుల నిర్లక్ష్యం వల్లే జిల్లా కేంద్ర ప్రభుత్వాస్పత్రిలో కనీస సదుపాయాలు లేవని అర్థమవుతోందన్నారు. సౌకర్యాలు లేకనా లేదా చనిపోయిన వ్యక్తి దళితుడు కాబట్టే ఇంత నిర్లక్ష్యమా అని ప్రశ్నించారు.
ఏలూరు (టూటౌన్): రాష్ట్ర బడ్జెట్‌లో విద్యారంగానికి కేవలం 10.5 శాతం మాత్రమే కేటాయించారని, ఇది విద్యార్థుల సమస్యల పరిష్కారానికి, ప్రభుత్వ విద్య బలోపేతానికి ఏమాత్రం సరిపోదని ఏఐఎస్‌ఎఫ్ ఏలూరు జిల్లా అధ్యక్షుడు డి.శివకుమార్ అన్నారు. కనీసం 30 శాతం నిధులు కేటాయించాలన్నారు. తల్లికి వందనం పథకానికి రూ.12 వేల కోట్లు అవసరం కాగా రూ.9,668 కోట్లు కేటాయించడం సరికాదన్నారు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో పలు సమస్యలు ఉన్నాయని, 4,200 ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ వంటి పోస్టులు ఖాళీలు ఉన్నాయన్నారు. అయినా బడ్జెట్‌లో 0.77 శాతం మాత్రమే నిధులు కేటాయించారన్నారు. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై బడ్జెట్‌లో ఊసే లేదని మండిపడ్డారు. హాస్టల్ విద్యార్థులకు మెస్, కాస్మోటిక్ చార్జీల పెంపు, భవనాలు, మరమ్మతులపై స్పష్టత లేదన్నారు. విద్యారంగానికి ప్రభుత్వం కేటాయించిన నిధులు అంకెల గారడీగా ఉన్నాయని, మరిన్ని నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): పవిత్ర ఖురాన్ అవతరంచిన రంజాన్ మాసంలో విధిగా ఉపవాసా లు, దానధర్మాలు, పుణ్యకార్యాలు చేయాలని జమాతే ఇస్లామీ హింద్ ఏలూరు జిల్లా అధ్యక్షుడు ముహ్మద్ ముజాహిద్ అన్నారు. స్థానిక శనివారపుపేటలోని జామియా మసీ దులో జమాతే ఇస్లామీ హింద్ శనివారపుపేట శాఖ ఆధ్వర్యంలో రంజాన్ స్వాగత సభను శనివారం రాత్రి నిర్వహించారు. ముఖ్య అతిథిగా ముజాహిద్ మాట్లాడుతూ మానవ జీవన విధా నాన్ని ఖురాన్ తెలియజేస్తుందన్నారు. తమ సంపాదనలో నుంచి జకాత్ (కొంత సొమ్ము) తీసి పేదలు, అనాథలకు ఇవ్వాలని దేవుడు ఆదేశించాడన్నారు. మసీదు ఇమామ్ హాఫిజ్ గులాం రబ్బానీ మాట్లాడుతూ సర్వమానవులకు ఖురాన్ మార్గదర్శకమన్నారు. ఉపవాసా లు పాటిస్తూ చెడు పనులకు దూరంగా ఉండాలని హితవుపలికారు. శనివారపు పేట శాఖ ప్రతినిధి షేక్ షాజహాన్, స్థానిక జమాత్ అధ్యక్షుడు అబ్దుల్ ఖాదర్ తదితరులు పాల్గొన్నారు.
ఫ్రీజర్ లేదు.. కావాలంటే తెచ్చుకోండి


