వీఆర్‌ఏల సమస్యలపై ముఖం చాటేసిన ప్రభుత్వం
ఉండి: గత ఎన్నికల సమయంలో వీఆర్‌ఏల సమస్యలు పరిష్కరిస్తామని మాటిచ్చిన కూటమి ప్రభు త్వం అధికారం చేపట్టిన తర్వాత ముఖం చాటేసిందని వీఆర్‌ఏల సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి పిల్లి సుబ్బారావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈనెల 18న వీఆర్‌ఏల సమస్యల పరిష్కారం కోరుతూ సంఘ ఆధ్వర్యంలో కలెక్టర్‌కు రాయబారం పంపే కార్యక్రమంపై ఆదివారం ఉండిలో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు 18న రాష్ట్రవ్యాప్తంగా కలెక్టర్లకు రాయబారం కార్యక్రమం నిర్వమించనున్నామన్నారు. సంఘ జిల్లా గౌరవాధ్యక్షుడు ఎం.ఆంజనేయులు మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం పలుమార్లు వినతులు ఇచ్చినా ఫలితం లేదన్నారు. కనీసం సమస్యల పరిష్కారం దిశగా ఆలోచన కూడా చేయడం లేదన్నారు. తెలంగాణ మాదిరి పే స్కేలు తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. భీమవరంలో జరిగే రాయబార కార్యక్రమాన్ని జిల్లాలోని వీఆర్‌ఏలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. వీఆర్‌ఏలు పాల్గొన్నారు.


