స్పందన
కొయ్యలగూడెం: అక్రమ క లప ట్రాక్టర్ స్వాధీనం చేసుకున్నట్టు కన్నాపురం అటవీశాఖ రేంజర్ భానుప్రకాష్ ఆదివారం తెలిపారు.. కుంకాల నుంచి అక్రమంగా కలపను ట్రాక్టర్‌పై తరలిస్తున్న సమాచారంతో ఎఫ్‌ఎస్‌ఓ మణికుమారి సిబ్బందితో కలిసి దాడులు చేశారన్నారు. ట్రాక్టర్ గుర్తించి రేంజ్ కార్యాల యానికి తరలించి కేసు నమోదు చేశామన్నారు. కలప అక్రమ రవాణాపై ఈనెల 8న, గత డిసెంబర్ 13న ‘సాక్షి’లో వచ్చిన కథనాలకు అటవీ శాఖ స్పందించింది. నెల రోజుల్లో పది కేసుల వరకు నమోదు చేయడం విశేషం.
తనఖా పెట్టిన బంగారం మాయం
జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెం ఐఐఎఫ్‌ఎల్ బ్యాంకులో ఓ మహిళ కుదవపెట్టిన బంగారాన్ని బ్రాంచ్ మేనేజర్ మాయం చేశాడు. ఎ స్సై ఎన్‌వీ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక పాత బస్టాండ్ ప్రాంతానికి చెందిన ఎన్.ధనలక్ష్మి ఐఐఎఫ్‌ఎల్ బ్యాంకులో 270 గ్రాము ల బంగారు ఆభరణాలను 2023లో తనఖా పె ట్టి రుణం తీసుకున్నారు. బ్రాంచ్ మేనేజర్ ఉ ద్దగిరి చైతన్య రాము రుణంపై వడ్డీ కట్టాలంటూ ఫోన్ చేసేవాడు. ధనలక్ష్మి వడ్డీ కట్టలేకపో వడంతో రుణాన్ని అప్‌డేట్ చేస్తానని, ధనలక్ష్మి ఫోన్‌కు ఓటీపీ వచ్చిందని చెప్పమని అడిగేవా డు. అలా పలుమార్లు ఓటీపీ తెలుసుకున్నాడు. గత డిసెంబర్ 20న ధనలక్ష్మి బంగారాన్ని విడిపించేందుకు బ్యాంకుకు వెళ్లగా ధనలక్ష్మి పేరు న అసలు బంగారం తనఖా లేదని తెలిసింది. చైతన్య రాము ఎప్పుడో మానివేశారని బ్యాంకు సిబ్బంది చెప్పారు. చైతన్య రాము ఆ బంగారా న్ని విడిపించి వేరే వ్యక్తుల పేరున పెట్టినట్టు తె లుస్తోంది. ధనలక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసు లు కేసు నమోదు చేశారు.బాధితులు ఇంకా చా లా మంది ఉన్నట్టు ధనలక్ష్మి ఫిర్యాదులో పేర్కొన్నారు. దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై చెప్పారు.
జంగారెడ్డిగూడెం: వైద్య పీజీ సీట్లు ఇప్పిస్తానని మోసం చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై ఎన్‌వీ ప్రసాద్ తెలిపారు. జంగారెడ్డిగూడేనికి చెందిన ఎస్‌కే షంషీర్ అహ్మద్ రాఘవాపురం పీహెచ్‌సీలో హెల్త్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఆయన పెద్ద కుమార్తె, మేనల్లుడు ఎంబీబీఎస్ పూర్తిచేశారు. విదేశాల్లో పీజీ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో అహ్మద్ కు తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా మ రికల్ గ్రామానికి చెందిన గుండా రాఘవ పరిచయమయ్యాడు. విదేశాల్లో పీజీ సీటు ఇప్పిస్తా నని నమ్మించాడు. దీంతో దఫదఫాలుగా షంషీర్ అహ్మద్ ఫోన్‌పే, ఆన్‌లైన్ ద్వారా రూ.19.50 లక్షలు రాఘవకు బదిలీ చేశారు. అనంతరం రాఘవకు ఫోన్ చేసినా సమాధానం చెప్పకపోవడం, పీజీ సీట్లు ఇప్పించకుండా తప్పించుకుని తిరుగుతూ మాయమాటలు చెప్పు కొచ్చాడు. దీంతో అహ్మద్ తాను మోసపోయానని గ్రహించి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై చెప్పారు.
పెదవేగి: వారం రోజుల్లోగా కోకో గింజల ధర ల పాలసీ ప్రకటించి, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ధర నిర్ణయించకపోతే కోకో రైతుల పోరాటం తప్పదని ఏపీ కోకో రైతుల సంఘం రాష్ట్ర స మావేశం హెచ్చరించింది. విజయరాయిలో ఆ దివారం రాష్ట్ర అధ్యక్షుడు బొల్లు రామకృష్ణ అ ధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. శ్రీనివాస్ మాట్లాడుతూ కోకో గింజల ధరను కి లోకు రూ.350కు తగ్గించడం దారుణమన్నా రు. ఆయిల్‌పామ్ మాదిరిగా ఫార్ములాతో కో కో గింజల ధర నిర్ణయించాలని కోరారు.
స్పందన


