ఎన్నడూ లేని సంక్షోభం
నేను 11 ఎకరాల్లో ఆక్వా సా గు చేస్తున్నాను. ఇటువంటి ఆక్వా సంక్షోభం ఎన్నడూ చూడలేదు. చాలా ఇబ్బంది పడుతున్నాం. ప్రభుత్వం కనీ సం విద్యుత్ సబ్సిడీ ఇవ్వడం లేదు. ఇది ఇస్తే కొంతైనా కో లుకుంటాం. ఫీడ్ ధరల తగ్గించాలి గతంలో ముడిసరుకుల ధరలు తగ్గినా కిలోకు రూ.20 తగ్గించాల్సి ఉన్నా తగ్గించలేదు. ప్రస్తుతం ఫిష్ మీల్ ధర పెరిగిన నేపథ్యంలో మళ్లీ ధరలు పెంచడం అన్యాయం.
–తంగెళ్లబాబు, ఆక్వా రైతు
నాణ్యత లేని సీడ్ వల్ల ఆక్వా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రస్తుతం ఈహెచ్‌పీ ఉన్న తల్లి రొయ్యల నుంచి సీడ్ దిగుమతి కావడంతో ఎక్కువ నష్టం జరుగుతోంది. సీఏఏ అధికారి ద్వారా సరైన పర్యవేక్షణ లేకపోవడం కారణంగా కనిపిస్తోంది. ఆక్వా సాగు బాగుండాలంటే మంచి సీడ్ లభించాలి. ఆక్వా రైతులు సమస్యలపై ప్రభుత్వం శ్రద్ధ తీసుకుని సాగుకు అన్నిరకాలుగా ప్రోత్సాహం అందించాలి.
–మరిడి వెంకటేశ్వరరావు, ఆక్వా రైతు
ఎన్నడూ లేని సంక్షోభం


