అక్రమ కలప స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

అక్రమ కలప స్వాధీనం

Feb 12 2026 7:30 AM | Updated on Feb 12 2026 7:30 AM

అక్రమ

అక్రమ కలప స్వాధీనం

అక్రమ కలప స్వాధీనం

కొయ్యలగూడెం: రేంజర్‌ భాను ప్రకాష్‌కి అందిన సమాచారంతో బుధవారం దిప్పకాయల పాడులో దాడులు నిర్వహించి అక్రమ కలపతో రవాణా అవుతున్న వాహనాన్ని స్వాధీనం చేసుకొని కన్నాపురం అటవీశాఖ కార్యాలయానికి తరలించినట్లు ఎఫ్‌ఎస్‌ఓ పి.మణికుమారి పేర్కొన్నారు. వాహనంలో సుమారు యాభైకి పైగా దిమ్మలతో ఉన్న టేకు దుంగలను గుర్తించి స్వాధీనం చేసుకున్నామన్నారు. కలప విలువను లెక్కించాల్సి ఉందన్నారు. బీట్‌ ఆఫీసర్‌ కె.నవీన్‌, కె.వెంకన్నబాబు, రాంబాబు పాల్గొన్నారు.

పంట కాలువలో

శిశువు మృతదేహం

పెదపాడు: పెదపాడు ఎస్సీ ఏరియాలోని కమ్యూనిటీ హాలు వద్ద పంట కాలువలో శిశువు మృతదేహం లభ్యమైంది. స్థానికులు బుధవారం సాయంత్రం మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై ఆర్‌.శ్రీనివాస్‌ అక్కడకు చేరుకుని శిశువు మృతదేహాన్ని బయటకు తీయించారు. అనంతరం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి పంపించారు. వీఆర్వో అనకాపల్లి నర్సింహరావు ఫిర్యాదు మేరకు ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జన్మనిచ్చిన బిడ్డను ఎవరు పడేశారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

అక్రమ కలప స్వాధీనం 1
1/1

అక్రమ కలప స్వాధీనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement