పంచముఖ ఆంజనేయుడికి వెండి కవచం
ద్వారకాతిరుమల: ఐఎస్ జగన్నాథపురంలోని సుందరగిరిపై శ్రీ కనకవల్లీ సమేత శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయంలో కొలువుదీరిన పంచముఖ ఆంజనేయస్వామికి ఓ దాత రూ.16 లక్షల విలువైన వెండి కవచాన్ని శనివారం బహూకరించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్న తూర్ల లక్ష్మీపురం గ్రామానికి చెందిన కొచ్చెర్లకోట సత్య వెంకట లక్ష్మీనరసింహం దంపతులు పంచముఖ ఆంజనేయ స్వామికి అలంకరణ నిమిత్తం 5.660 కేజీల బరువుగల వెండి కవచాన్ని ప్రత్యేకంగా తయారు చేయించారు. ముందుగా నరసింహ గురూజీ దీన్ని శిరస్సుపై పెట్టుకుని మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్ఛరణల నడుమ ఆలయంలో ప్రదక్షిణలు చేశారు. అనంతరం ఆలయ ఈఓ యర్రంశెట్టి భద్రాజీకి అందించారు.


