పంచాయతీ ఎన్నికలకు కసరత్తు | - | Sakshi
Sakshi News home page

పంచాయతీ ఎన్నికలకు కసరత్తు

Feb 11 2026 7:40 AM | Updated on Feb 11 2026 7:40 AM

పంచాయ

పంచాయతీ ఎన్నికలకు కసరత్తు

హరహర మహాదేవ నృసింహ మహా యజ్ఞానికి ఏర్పాట్లు

న్యూస్‌రీల్‌

కూటమిలో రచ్చ తప్పదా..?

షెడ్యూల్‌ ప్రకారం నిర్వహించాలి

స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరపాలి

ఏప్రిల్‌ 2తో ముగియనున్న పదవీకాలం

హరహర మహాదేవ
శివరాత్రి ఉత్సవాలకు శైవ క్షేత్రాలు ముస్తాబవుతున్నాయి. ఈనెల 13 నుంచి 17వ తేదీ వరకు ఉత్సవాల నేపథ్యంలో శివాలయాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకోనుంది. 8లో u

శ్రీవారి ఆలయానికి దత్తత ఆలయమైన శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయంలో శ్రీ సుదర్శన, నరసింహ ధన్వంతరీ మహాయజ్ఞానికి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. 8లో u

బుధవారం శ్రీ 11 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026

ఏలూరు (టూటౌన్‌): పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశాలతో జిల్లా యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. గతేడాది సెప్టెంబర్‌ 3న రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ తాత్కాలిక షెడ్యూల్‌ను ప్రతిపాదించి, అందుకు అనుగుణంగా కార్యక్రమాలను చేపట్టాలని అప్పట్లోనే జిల్లా పంచాయతీ అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతీ జిల్లా నుండి ముగ్గురు అధికారులకు పలు సాంకేతిక అంశాలపై శిక్షణ కూడా ఇచ్చారు. తాజాగా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ మార్చి 9 నాటికి పంచాయతీ ఓటర్ల జాబితాను సిద్ధం చేసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో పల్లెల్లో ఎన్నికల వేడి రాజుకుంది. చాలా మంది ఆశావహులు పోటీలో దిగేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అవసరమైన ఆర్థిక గణాంకాల లెక్కలు వేసుకుంటున్నారు.

ఏలూరు జిల్లాలో మొత్తం 543 పంచాయతీలు

జిల్లాల పునర్విభజన అనంతరం ఏలూరు జిల్లా వ్యాప్తంగా 27 మండలాల పరిధిలో మొత్తం 543 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటి పరిఽధిలో మొత్తం 5,687 వార్డులు ఉన్నాయి. ఏలూరు నగరపాలక సంస్థ పరిధిలో 50 డివిజన్లు ఉన్నాయి. జంగారెడ్డిగూడెం పురపాలక సంఘంలో 29, నూజివీడు పురపాలక సంఘంలో 32 వార్డులు ఉన్నాయి. చింతలపూడి నగర పంచాయతీలో 20 వార్డులు ఉన్నాయి.

ప్రారంభమైన ఎన్నికల చర్చలు

గ్రామాల్లో ఎన్నికల హడావుడి మొదలైంది. రచ్చబండల వద్ద జనం చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ సారి ఎన్నికల్లో ఎవరు పోటీ చేస్తారు. పోటీ చేసిన వారిలో ఎవరు గెలుస్తారు అనే లెక్కలు వేసుకుంటున్నారు. కిళ్లి షాపులు, టీ దుకాణాలు, హోటల్స్‌ వంటి వాటి వద్ద కూడా పంచాయతీ ఎన్నికల గురించి చర్చలు సాగుతున్నాయి.

బయటకు వస్తున్న ఆశావహులు

పంచాయతీ ఎన్నికలు త్వరలోనే నిర్వహించే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఆసక్తిగా ఉన్న పలువురు ఆశావహులు తెరపైకి వస్తున్నారు. ఎవరికి వారు తెరవెనుక కసరత్తు చేస్తున్నారు. సామాజిక వర్గాల వారీగా సమాలోచనలు చేస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా ఈ సారి ఎన్నికల్లో అధికార పార్టీ వైపు నుంచి కంటే ప్రతిపక్ష పార్టీ వైపు నుంచి పోటీ చేసేందుకు ఆశావహులు పెద్ద సంఖ్యలో పైరవీలు చేస్తున్నారు.

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య పోటీ విషయంలో రచ్చ తప్పేలా లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రతి పంచాయతీలో టీడీపీకి పోటీగా జనసేన నుంచి ఆశావహులు ప్రయత్నాలు మొదలెట్టేసారు. తమకు ఇవ్వాల్సిందే నంటూ గ్రామ స్థాయి నాయకులు మండల, నియోజకవర్గ స్థాయి నాయకుల వద్ద అప్పుడే పైరవీలు చేస్తున్నారు. సీట్ల విషయంలో కూటమి పార్టీల్లోని అసంతృప్తే ప్రతిపక్ష పార్టీ అభ్యర్థుల విజయానికి పరోక్షంగా దోహాదపడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

పంచాయతీ ఎన్నికలను షెడ్యూల్‌ ప్రకారం నిర్వ హించాలి. ఎన్నికల కమీషన్‌ రాజ్యాంగ బద్దమైన వ్యవస్థ. ఈ వ్యవస్థ సరిగా పనిచేసేలా అధికారులు కృషి చేయాలి. ప్రజల్లో నమ్మకం కలిగించి రాబోయే స్థానిక ఎన్నికల్లో నిజాయితీగా ఎన్నికల కమీషన్‌ పనిచేయాలి.

– మెండెం సంతోష్‌ కుమార్‌, రాష్ట్ర అధ్యక్షుడు, ఎస్సీ సర్పంచుల హక్కుల పరిరక్షణ సంఘం

పంచాయతీ ఎన్నికలను స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేలా ఎన్నికల కమిషన్‌ పనిచేయాలి. ఎస్సీ, ఎస్టీ సర్పంచుల రిజర్వేషన్ల స్థానాల్లో ఇతరుల పెత్తనం లేకుండా చూడాలి. సరైన సమయంలో ఎన్నికలు నిర్వహిస్తే గ్రామీణ వాతావరణంలో ప్రజలకు సేవ చేసే అవకాశం ప్రజా ప్రతినిధులకు కల్పించినట్లు అవుతుంది.

– కంచర్ల వాణి, సర్పంచ్‌,

గోపవరం, ముసునూరు మండలం

ఏప్రిల్‌ 2తో ముగియనున్న పాలన

మార్చి 9 నాటికి ఓటర్ల జాబితా సిద్ధం చేయాలని తాజాగా ఆదేశాలు

ఇప్పటికే పల్లెల్లో మొదలైన ఎన్నికల హడావుడి

పోటీకి రంగం సిద్ధం చేసుకుంటున్న ఆశావహులు

జిల్లాలో మొత్తం 543 పంచాయతీలు, 5,687 వార్డులు

రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీల పాలన 2021, ఏప్రిల్‌ 3న ప్రారంభమైంది. పంచాయతీల పాలకవర్గ పదవీ కాలం ఈ ఏడాది ఏప్రిల్‌ 2తో ముగియనుంది. దీంతో నిర్ణీత సమయంలోగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా చేపట్టాల్సిన ప్రక్రియను పూర్తి చేసుకునేందుకు ఎన్నికల కమిషన్‌ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జనవరి 1 వరకు ఉన్న అసెంబ్లీ ఓటర్ల జాబితా ఆధారంగా పంచాయతీల్లో వార్డుల వారీగా ఓటర్ల జాబితాను సిద్ధం చేసుకోవాలని ఎన్నికల కమిషన్‌ ఆదేశాలు జారీ చేసింది. దానికి అనుగుణంగా జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయంలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న గ్రామ పంచాయతీల్లో ఎన్నికలను నిర్వహించేందుకు వీలుగా ఆయా గ్రామ పంచాయతీల్లో వార్డుల వివరాలు, జనాభా, సామాజిక వర్గాల వివరాలు సేకరించడం తదితర పనులలో అధికార యంత్రాంగం బిజీగా ఉంది. ఆయా పనుల్లో జిల్లాలోని పంచాయతీ అధికారులు, సిబ్బంది తలమునకలై ఉన్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా 2021 ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించారు. ఏప్రిల్‌ 3న నూతన పాలకవర్గాలు బాధ్యతలు స్వీకరించాయి. ఈ క్రమంలో ఈ ఏడాది ఏప్రిల్‌ 2న పంచాయతీ పాలకవరా్గాల పదవీకాలం ముగియనుంది. ఈ లోగా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలి. పురపాలక, నగర పంచాయతీలు, నగరపాలక సంస్థల పాలకవర్గాల గడువు మార్చి 17తో, ఎంపీటీసీ, జెడ్పీటీసీల పదవీ కాలం సెప్టెంబర్‌ 23, 24తో పూర్తి కానుంది. 2021లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా 862 గ్రామ పంచాయతీల పరిధిలో 9,660 వార్డు స్థానాలకు నాలుగు విడతల్లో ఎన్నికలు నిర్వహించారు.

పంచాయతీ ఎన్నికలకు కసరత్తు1
1/3

పంచాయతీ ఎన్నికలకు కసరత్తు

పంచాయతీ ఎన్నికలకు కసరత్తు2
2/3

పంచాయతీ ఎన్నికలకు కసరత్తు

పంచాయతీ ఎన్నికలకు కసరత్తు3
3/3

పంచాయతీ ఎన్నికలకు కసరత్తు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement