పట్టిసంలో పటిష్ట బందోబస్తు | - | Sakshi
Sakshi News home page

పట్టిసంలో పటిష్ట బందోబస్తు

Feb 13 2026 3:14 AM | Updated on Feb 13 2026 3:14 AM

పట్టిసంలో పటిష్ట బందోబస్తు

పట్టిసంలో పటిష్ట బందోబస్తు

పట్టిసంలో పటిష్ట బందోబస్తు

పోలవరం రూరల్‌: పట్టిసంలో జరిగే మహాశివరాత్రి ఉత్సవాలకు 550 మంది పోలీస్‌ సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టు జిల్లా ఎస్పీ కేపీ శివకిషోర్‌ అన్నారు. పట్టిసీమలో మహాశివరాత్రి ఉ త్సవాలకు సంబంధించి ఏర్పాట్లను పరిశీలించారు. ఆలయం, ఇసుక తిన్నెలు, రేవులో ఏర్పాట్లపై సూచనలిచ్చారు. ఆయన వీరేశ్వరస్వామిని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఏటిగట్టు రోడ్డులో ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా పర్యవేక్షించాలన్నారు. ట్రైనీ ఐఎఫ్‌ఎస్‌ కృష్ణచైతన్య, ట్రైనీ ఐపీఎస్‌ జయశర్మ, ఏఎస్పీ సుస్మిత రా మనాథన్‌, డీఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు, సీఐ బాల సురేష్‌బాబు, ఎస్సై పవన్‌కుమార్‌ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement