కదం తొక్కి.. లేబర్‌ కోడ్లపై గళమెత్తి.. | - | Sakshi
Sakshi News home page

కదం తొక్కి.. లేబర్‌ కోడ్లపై గళమెత్తి..

Feb 13 2026 3:14 AM | Updated on Feb 13 2026 3:14 AM

కదం తొక్కి.. లేబర్‌ కోడ్లపై గళమెత్తి..

కదం తొక్కి.. లేబర్‌ కోడ్లపై గళమెత్తి..

కదం తొక్కి.. లేబర్‌ కోడ్లపై గళమెత్తి..

వైఎస్సార్‌సీపీ సంఘీభావం

విద్యుత్‌ ఉద్యోగుల ఆందోళన

గర్జించిన కార్మిక, కర్షక, ఉద్యోగ సంఘాలు

భారీ ప్రదర్శనలు, నిరసన ర్యాలీలు

లేబర్‌ కోడ్లు రద్దు చేయాలంటూ డిమాండ్‌

ఏలూరు (టూటౌన్‌): కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్‌ కోడ్లు రద్దు చేయాలని కోరు తూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గురువారం జరిగిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో వేలాది మంది కార్మికులు పాల్గొని విజయవంతం చేశారు. భారీ ప్రదర్శనలతో హోరెత్తించారు. ఏలూరు కలెక్టరేట్‌ వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో, ఆర్‌ఆర్‌పేట ఎన్టీఆర్‌ పార్కు వద్ద ఏఐటీయూసీ, ఐఎఫ్‌టీయూ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభలు నిర్వహించారు. ఏలూ రు జిల్లాలో బ్యాంకులు, బీమా, బీఎస్‌ఎన్‌ఎల్‌ తదితర కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డా యి. కార్మికులు సమ్మెలో ఉండటంతో పలు పరిశ్రమలు నడవలేదు. అంగన్‌వాడీ, ఆశావర్కర్లు, ము న్సిపల్‌, హమాలీ వర్కర్లు, భవన నిర్మాణ కార్మికులు, ఆటో, రవాణా కార్మికులు, మెడికల్‌ రిప్స్‌, ఎల్‌ఐసీ ఏజెంట్లు, రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు, ఆర్టీసీ, విద్యుత్‌ సంస్థల్లో పనిచేసే కార్మికులు సంఘీభావం తెలిపారు.

కార్మికుల మెడకు ఉరితాడే..

లేబర్‌ కోడ్స్‌ అమలు చేయడం అంటే కార్మికుల మెడకు ఉరుతాడు వేయడమే అని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి.ఉమామహేశ్వరావు అన్నారు. సీఐటీయూ ఆధ్వర్యంలో జూట్‌ మిల్లు సెంటర్‌ నుంచి భారీ ప్రదర్శన జరిగింది. కార్మికులు విన్నూతంగా ఉరి బిగించుకుని నిరసన తెలిపారు. కలెక్టరెట్‌ వద్ద భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఏలూరు కార్పొరేషన్‌ కార్యాలయం నుంచి ఏఐటీయూసీ, ఐఎఫ్‌టీయూ, ఉద్యోగ, కార్మిక సంఘాల నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఎన్టీఆర్‌ పార్క్‌ వద్ద జరిగిన సభలో ఐఎఫ్‌టీయు రాష్ట్ర సహాయ కార్యదర్శి యు.వెంకటేశ్వరరావు, ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ జాతీయ నాయకురాలు అక్కినేని వనజ మా ట్లాడుతూ లేబర్‌ కోడ్లపై మండిపడ్డారు.

కలెక్టరేట్‌ ఎదుట ఉద్యోగుల నిరసన

అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య (ఏఐఎస్‌జీఈఎఫ్‌), ఏపీఎన్‌జీఓస్‌ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు జిల్లా ఎన్జీజీఓ, జేఏసీ చైర్మన్‌ చోడగిరి శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో జాతీయ సార్వత్రిక సమ్మెకు మద్దతుగా ఏలూరులోని కలెక్టరేట్‌ వద్ద భోజన విరామ సమయంలో ఉ ద్యోగులు నిరసన తెలిపారు. రాష్ట్ర కార్యదర్శి ఎం. సరస్వతి, జిల్లా కార్యదర్శి నెరుసు రామారావు పాల్గొన్నారు.

దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఏలూరులో జరిగిన నిరసన కార్యక్రమాలకు వైఎస్సార్‌సీపీ ఏలూరు ని యోజకవర్గ ఇన్‌చార్జి మామిళ్లపల్లి జయప్రకాష్‌ (జేపీ), మాజీ ఎమ్మెల్యే, దెందులూరు నియోజకవర్గ ఇన్‌చార్జి కొఠారు అబ్బయ్యచౌదరి సంఘీభా వం తెలిపారు. కార్మికుల శ్రమదోపిడీకి వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ పోరాడుతుందని తెలిపారు. వైఎస్సార్‌సీపీ నగర అధ్యక్షుడు గుడిదేసి శ్రీనివాస్‌, జిల్లా బీసీ సెల్‌ అధ్యక్షుడు నెరుసు చిరంజీవి, జిల్లా బీసీ సెల్‌ ప్రధాన కార్యదర్శి కొల్లిపాక సురేష్‌, రాష్ట్ర వాణిజ్య విభాగ కార్యదర్శి భాస్కర్ల శంకర్‌ బాచి, సత్యనారాయణ, బసవ, రవలిశెట్టి శ్రీనివాస రావు, ఉయ్యాల గణేష్‌ తదితరులు పాల్గొన్నారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): స్క్రాప్‌ ఎలక్ట్రిసిటీ (ఎమెండ్‌మెంట్‌) బిల్‌–2025కు వ్యతిరేకంగా విద్యుత్‌ ఉద్యోగులు గురువారం ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక ఆర్‌ఆర్‌పేటలోని విద్యుత్‌ భవన్‌ వద్ద మధ్యాహ్న భోజన విరామ సమయంలో విద్యుత్‌ ఉద్యోగుల జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. నాయకులు మాట్లాడుతూ విద్యుత్‌ రంగాన్ని, విద్యుత్‌ వనరులను ప్రైవేటీకరించేందుకు తీసుకువచ్చిన ఈ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ఈ చట్టంతో ఉద్యోగులతో పాటు వినియోగదా రులకు నష్టం జరుగుతుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement