బలివే ఉత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

బలివే ఉత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు

Feb 13 2026 3:14 AM | Updated on Feb 13 2026 3:14 AM

బలివే ఉత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు

బలివే ఉత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు

బలివే ఉత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు

ముసునూరు: బలివే మహాశివరాత్రి ఉత్సవాల్లో భక్తుల సౌకర్యాలు, భద్రతకు అధిక ప్రాధాన్యమివ్వాలని జేసీ అభిషేక్‌ గౌడ్‌ అన్నారు. ఉత్సవాల ప్రత్యేకాధికారి, నూజివీడు సబ్‌ కలెక్టర్‌ బొల్లిపల్లి వినూత్న అధ్యక్షతన గురువారం ఆలయం వద్ద సమీక్షా సమావేశం నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ గతేడాది కంటే అధికంగా భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలన్నారు. భక్తుల పుణ్యస్నానాలు, పిండ ప్రదానాలు, అభిషేకాలు, దైవ దర్శనానికి ఆటంకాలు లేకుండా చూడాలన్నారు. జిల్లా ఎస్పీ కేపీ శివకిషోర్‌ మాట్లాడుతూ 400 మంది పోలీసులు, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌ క్యాడెట్లు, సెక్యూరిటీ సిబ్బంది, సీసీ కెమెరాల నిఘాతో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నామన్నారు. డీఎస్పీ కేవీవీఎన్వీ ప్రసాద్‌తో కలిసి ఆలయ ప్రాంగణం లోపల, వెలుపల క్యూలైన్లు, ప్రసాద కౌంటర్లు, పందిళ్లను పరిశీలించారు. ట్రైనీ ఐపీఎస్‌ జయసింహ, సర్పంచ్‌ రావు ప్రవీణ సుధాకర్‌, ఆలయ కమిటీ చైర్మన్‌ బొమ్మకంటి శ్యామలరావు, తహసీల్దార్‌ ప్రశాంతి, ఈవో పామర్తి సీతారామయ్య, సీఐ రామకృష్ణ, ఎస్సై ఎం.చిరంజీవి ఉన్నారు.

జేసీ అభిషేక్‌ గౌడ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement