కూలికెళ్లారు.. క్షతగాత్రులయ్యారు
● నిర్మాణంలో ఉన్న భవనం శ్లాబ్ కూలి ప్రమాదం
● 12 మందికి గాయాలు
● వీరిలో ఆరుగురికి తీవ్ర గాయాలు
జంగారెడ్డిగూడెం: పొట్టకూటి కోసం కూలి పనులకు వెళ్లిన కార్మికులు నిర్మాణంలో ఉన్న భవనం శ్లాబ్ కుప్పకూలడంతో క్షతగాత్రులై మంచాన పడ్డారు. మండలంలోని వేగవరంలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ భవన నిర్మాణం శ్లాబ్ పనులు జరుగుతున్నాయి. సుమారు 100 మంది పనిచేస్తున్నారు. భవనం పొడవునా మొ దటి అంతస్తులో పోర్టికో నిర్మాణం జరుగుతుండటంతో గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మొదటి అంతస్తు వరకు నిర్మించిన రెండు పిల్లర్ల సామర్థ్యం సరిపోకపోవడంతో నిర్మిస్తున్న శ్లాబ్ శనివారం ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో కార్మికులంతా మొదటి అంతస్తు నుంచి నేలపై శ్లాబ్‌తో సహా పడిపోయారు. ఈ ప్రమాదంలో 12 మంది గాయపడ్డారు. వారిని జంగారెడ్డిగూడెంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో ఆరుగురికి స్వల్ప, మరో ఆరుగురికి తీవ్ర గా యాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన కార్మికులు ఆ స్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
క్షతగాత్రులను పరామర్శించిన జెట్టి : ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కార్మికులను వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి, మచిలీపట్నం పార్లమెంట్ పరిశీలకుడు జెట్టి గురునాథరావు పరామర్శించారు. ఈ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న శ్లాబ్ కూలీ ప్రమాదం జరగడం ఇదే ప్రథమమని, మళ్లీ ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా భవన నిర్మాణ యాజమాన్యాలు చర్య లు తీసుకోవాలని కోరారు. కార్మికులు వ్యక్తిగత భద్రతకు ఏర్పాట్లు చేయాలన్నారు. నిర్మాణాలను అధికారులు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. బాధితులకు వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని, మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. జిల్లా కార్యదర్శి ముప్పిడి శ్రీనివాసరావు, బత్తిన చి న్న, వీరవల్లి సోమేశ్వరరావు, కె.వసంత కుమార్, ప ట్టణ యూత్ అధ్యక్షులు నేకూరి కిషోర్, చేతివృత్తుల విభాగం అధ్యక్షులు జీడికంటి రామారావు, కడిమి కి రణ్ ఉన్నారు. అలాగే సీఐటీయూ మండల కన్వీనర్ పి.సూర్యారావు క్షతగాత్రులను పరామర్శించారు. కార్మికులు పూర్తిగా కోలుకునే వరకూ యాజమాన్యం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే సొంగా రోషన్‌కుమార్ బాధితుల వివరాలు ఫోన్‌లో అడిగి తెలుసుకున్నారు.
కూలికెళ్లారు.. క్షతగాత్రులయ్యారు
కూలికెళ్లారు.. క్షతగాత్రులయ్యారు
కూలికెళ్లారు.. క్షతగాత్రులయ్యారు


