అంతరాలయ దర్శనం.. కట్టుదిట్టం | - | Sakshi
Sakshi News home page

అంతరాలయ దర్శనం.. కట్టుదిట్టం

Feb 23 2026 7:34 AM | Updated on Feb 23 2026 7:34 AM

అంతరాలయ దర్శనం.. కట్టుదిట్టం

అంతరాలయ దర్శనం.. కట్టుదిట్టం

ద్వారకాతిరుమల: చినవెంకన్న అంతరాలయ దర్శ నం టికెట్ల రీప్రింట్‌ దందాకు పూర్తిస్థాయిలో చెక్‌ పడింది. దీంతో స్వామివారి ఆదాయం గణనీయంగా పెరిగింది. గత శనివారంతో పోలిస్తే ఈ వారం 151 అంతరాలయ దర్శనం టికెట్లు అధికంగా అ మ్ముడయ్యాయి. ఈనెల 15న ‘సాక్షి’లో ‘దొడ్డిదారిన శ్రీవారి దర్శనాలు’ శీర్షికన ప్రచురించిన కథనంతో టికెట్ల రీప్రింట్‌ వ్యవహారం బయటపడింది. దీ నిపై స్పందించిన దేవస్థానం చైర్మన్‌ ఎస్వీ సుధాకరరావు, ఆలయ అనువంశిక ధర్మకర్త ఎస్వీఎన్‌ఎన్‌ నివృతరావు, ఈవో వై.భద్రాజీ చర్యలు తీసుకు న్నారు. పలువురు అధికారుల విధులను మార్పు చేశారు. అలాగే ఏఈఓ మెట్టపల్లి దుర్గారావు వీఐపీల పేరుతో వచ్చేవారి వివరాలను పూర్తిస్థాయిలో పరిశీలించిన తర్వాత అంతరాలయ దర్శనానికి అ నుమతిస్తున్నారు. అయితే దర్శనం టికెట్లను మాత్రం తప్పనిసరిగా కొనుగోలు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. అధికారుల చర్యలతో అంతరాలయ దర్శనం టికెట్ల విక్రయాలు అధికంగా పెరిగాయి. ఈనెల వరుసగా మూడు శనివారాల్లో విక్రయించిన అంతరాలయ దర్శనం టికెట్ల సంఖ్యను పరిశీలిస్తే మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఈనెల 7న 476, 14న 670, 21న 821 టికెట్లను విక్రయించారు. టికెట్ల రీప్రింట్‌ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత తొలి శనివారం 821 టికెట్లు విక్రయించడం విశేషం. గత వారంతో పోలిస్తే 151 టికెట్లు అదనంగా విక్రయించగా దేవస్థానానికి అ దనంగా రూ.75,500 ఆదాయం సమకూరింది. ఆ దివారం సాయంత్రం 6 గంటల వరకు 527 అంతరాలయ దర్శనం టికెట్లను విక్రయించారు.

టికెట్ల రీప్రింట్‌ దందాకు చెక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement