ఉద్యోగుల గ్రీవెన్స్‌కు 46 అర్జీలు | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగుల గ్రీవెన్స్‌కు 46 అర్జీలు

Feb 21 2026 7:31 AM | Updated on Feb 21 2026 7:31 AM

ఉద్యోగుల గ్రీవెన్స్‌కు 46 అర్జీలు

ఉద్యోగుల గ్రీవెన్స్‌కు 46 అర్జీలు

ఉద్యోగుల గ్రీవెన్స్‌కు 46 అర్జీలు పైపులైన్లకు మరమ్మతులు దివ్యాంగుల పీజీఆర్‌ఎస్‌ మధ్యాహ్న భోజనంపై విస్తృత తనిఖీలు డిజిటల్‌లో జనగణన

ఏలూరు(మెట్రో): ప్రభుత్వ ఉద్యోగుల స మస్యల పరిష్కారానికి ప్రతినెలా మూడో శుక్రవారం ఎంప్లాయిస్‌ గ్రీవెన్స్‌ డే నిర్వహిస్తున్నట్టు డీఆర్వో వి.విశ్వేశ్వరరావు తెలిపారు. కలెక్టరేట్‌లో శుక్రవారం గ్రీవెన్స్‌ డే నిర్వహించారు. ఉద్యోగుల సంక్షేమం, సమస్యల పరిష్కారానికి కృషిచేస్తున్నట్టు ఆయన చెప్పారు. 46 మంది ఉద్యోగులు అర్జీలు సమర్పించారు. స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ ఎల్‌.దేవకీదేవి, హౌసింగ్‌ డీడీ జి.సత్యనారాయణ, డీపీఓ కె.అనురాధ, ఏపీఎస్‌జీఓ జిల్లా ప్రెసిడెంట్‌ చోడగిరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

అర్జీల్లో కొన్ని..

● చింతలపూడి మండలం యర్రగుంటపల్లి ప్రభుత్వ బీసీసి బాలురు వసతి గృహ హాస్టల్‌ వెల్ఫేర్‌ అధికారి బి.శశికుమార్‌ తన సస్పెన్షన్‌ రద్దు చేయాలని కోరారు.

● ద్వారకాతిరుమల మండలం గుణ్ణంపల్లి జెడ్పీ–1 స్కూల్‌ అసిస్టెంట్‌ (పీడీ) పెండింగ్‌లో ఉన్న ఇంక్రిమెంట్‌ మంజూరు చే యాలని అర్జీ అందించారు.

● ఏలూరు జెడ్పీ ఏఓ కె.కనకరాజు నోషనల్‌ పదోన్నతి, పే ఫిక్సేషన్‌ ఇంక్రిమెంట్ల కోసం అర్జీ సమర్పించారు.

● కుక్కునూరు పంచాయతీ కార్యదర్శి వీవీ ఎస్‌ ఆంజనేయులు తన సస్పెన్షన్‌ రద్దు చే యాలని అభ్యర్థించారు.

● కొయ్యలగూడెం సాంఘిక సంక్షేమ శాఖ అధికారి పి.నాగసాయమ్మ గ్రేడ్‌–1 పదోన్నతి, పెండింగ్‌లో ఉన్న ఇంక్రిమెంట్ల కోసం వినతిపత్రం సమర్పించారు.

తాడేల్లిగూడెం (టీఓసీ): తాడేపల్లిగూడెం 6వ వార్డు ఇందిరానగర్‌ గాంధీ బొమ్మ సెంటర్‌ నుంచి టీటీడీ కల్యాణ మండపం ప్రాంతంలో ఏరియా ఆస్పత్రికి వెళ్లే మార్గంలో ప్రధాన పైపులైన్‌కు అధికారులు మరమ్మతులు చేపట్టారు. ఈనెల 12న ‘లీకేజీలతో పెరుగుతున్న నీటి కష్టాలు’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురించిన కథనానికి స్పందించారు. మున్సిపల్‌ వాటర్‌ వర్క్స్‌ సిబ్బంది పలుచోట్ల లీకేజీలను అరికట్టారు.

భీమవరం (ప్రకాశంచౌక్‌): సేవాభావంతో విభి న్న ప్రతిభావంతుల సమస్యల పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని జేసీ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి సూచించారు. కలెక్టరేట్‌లో తొలిసారిగా శుక్రవారం విభిన్న ప్రతిభావంతుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక పీజీఆర్‌ఎస్‌ నిర్వహించారు. ఆరోగ్య సమస్యలు, వై ద్యం, ఉపాధి, రూ.15 వేల పింఛన్‌, బ్యాంకు రుణాల కోసం పలువురు అర్జీలు అందించారు. మొత్తంగా 40 అర్జీలను స్వీకరించారు. నలుగురు శారీరక దివ్యాంగులకు జేసీ స్మార్ట్‌ఫోన్లు అందించారు. విభిన్న ప్రతిభావంతులు, వృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకుడు బి.రామ్‌కుమార్‌, డీఎంహెచ్‌ఓ జి.గీతాబాయి, డ్వామా పీడీ కేసీహెచ్‌ అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

భీమవరం (ప్రకాశంచౌక్‌): మధ్యాహ్న భోజనం పథకం అమలు తీరుపై జిల్లావ్యాప్తంగా విస్తృత తనిఖీలు నిర్వహించినట్టు కలెక్టర్‌ సీహెచ్‌ నాగరాణి తెలిపారు. జిల్లాలోని 916 మంది అధికారులు బుధవారం 20 మండలాల్లో పాఠశాలలను తనిఖీ చేసి పథకం అమలును పరిశీలించినట్టు చెప్పారు. 916 పాఠశాలల్లో 61,573 మంది విద్యార్థులకు 52,171 మంది హాజరుకాగా 50,033 మంది మధ్యాహ్న భోజనాన్ని భుజించారన్నారు. పథకాన్ని పటిష్టంగా అమ లు చేయాలని, ఆహార పదార్థాల నాణ్యతలో రాజీ పడబోమని అన్నారు.

భీమవరం (ప్రకాశంచౌక్‌): 2027 జనాభా లెక్కల సేకరణకు ప్రత్యేకత ఉందని, డిజిటల్‌ రూపంలో వివరాలు సేకరించడంతో పాటు వెబ్‌ పోర్టల్‌ ద్వారా ప్రజలు వ్యక్తిగతంగా సెల్ఫ్‌ ఎన్యూమరేట్‌ చేసుకునే వీలుంటుందని కలెక్టర్‌ సీహెచ్‌ నాగరాణి అన్నారు. జనాభా లెక్కల సేకరణపై ప్రిన్సిపల్‌ సెన్సస్‌ అధికారులు కలెక్టర్లతో రాష్ట్రస్థాయి సమావేశాన్ని అమరావతిలో నిర్వహించారు. జిల్లా కలెక్టర్‌ నాగరాణి సమావేశానికి హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement