తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో జాగృతి
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): శనివారపు పేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో నగరానికి చెందిన నారాయణం జాగృతి ప్రపంచ తెలుగు బుక్ ఆఫ్ రికార్డులో ఏడు కొత్త రికార్డులను సాధించి రికార్డు నెలకొల్పిందని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గారపాటి ప్రకాష్‌రావు తెలిపారు. జాగృతి ఇంతవరకు అనేక రంగాల్లో ప్రతిభ చూపి రికార్డులు సాధించిందని.. తాజాగా 7 రికార్డులు మైలురాయిగా నిలిచాయన్నారు. ఈ విజయంతో తెలుగు ప్రతిభను ప్రపంచ స్థాయిలో మరోసారి చాటి చెప్పిందన్నారు.
పాలకొల్లు సెంట్రల్: ఏపీ వీల్ చైర్ క్రికెట్ కెప్టెన్‌గా పాలకొల్లు పట్టణానికి చెందిన మురపాక నళిని రాజశేఖర్ ఎంపికయ్యాడు. క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో ఫిబ్రవరి 23 నుంచి 28 వరకూ నిర్వహించనున్న జాతీయ వీల్ చైర్ క్రికెట్ పోటీలకు రాజశేఖర్‌ను కెప్టెన్‌గా నియమిస్తూ ఏసీఏ శుక్రవారం ప్రకటించింది.


