విజన్ పేరుతో రాష్ట్రం అథోగతి
సూపర్ సిక్స్ అంటూ గద్దెనెక్కిన చంద్రబాబు ప్రజల్ని వంచించి పాలన సాగిస్తున్నారు. ఇప్పటివరకు ప్రవేశపెట్టిన మూడు బడ్జెట్‌లలో ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, సున్నావడ్డీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పింఛన్ హామీలకు ఒక్క రూపాయి కూడా కేటాయింపు చేయలేదు. అమరావతి అంటూ రెండేళ్లలో రెండు లక్షల కోట్లకు పైనే అప్పులు తెచ్చి ఎక్కడ పెట్టారో అర్థంకాని పరిస్థితి. విజన్ పేరుతో రాష్ట్రాన్ని అథోగతిపాలు చేస్తున్నారు.
– ముదునూరి మురళీకృష్ణంరాజు, వైఎస్సార్ సీపీ పశ్చిమగోదావరి జిల్లా అబ్జర్వర్ / సాక్షి, భీమవరం


