80 వేల నాణేలతో శివలింగం | - | Sakshi
Sakshi News home page

80 వేల నాణేలతో శివలింగం

Feb 15 2026 7:32 AM | Updated on Feb 15 2026 7:32 AM

80 వే

80 వేల నాణేలతో శివలింగం

80 వేల నాణేలతో శివలింగం వ్యక్తి అనుమానాస్పద మృతి

పోలవరం రూరల్‌: పట్టిసం శివక్షేత్రానికి ఒక భక్తుడు నాణేలతో తయారు చేసిన శివలింగాన్ని అందజేశారు. గోపాలపురం మండలం కొవ్వూరుపాడు గ్రామానికి చెందిన చిలక సాయి రూ.1.25 లక్షలతో 80 వేల నాణేలతో శివలింగాన్ని తయారు చేశారు. ఆ శివలింగాన్ని ఆ గ్రామం నుంచి అధిక సంఖ్యలో భక్తులతో ఊరేగింపుగా తీసుకొచ్చి పట్టిసంలో దేవస్థానం అధికారులకు అప్పగించారు. నిత్యం ఈ శివలింగానికి భక్తులు కొలిచేలా ఏర్పాటు చేయాలని దేవస్థానం ఫౌండర్‌ ఫ్యామిలీ మెంబర్‌ కె.వీరభద్రరావు, ఈవో సీహెచ్‌ వెంకటలక్ష్మిని కోరారు. ఈ శివలింగం తయారీకి సుమారు 2 నెలలు పట్టిందని చిలక సాయి తెలిపారు.

ఏలూరు టౌన్‌: ఏలూరు త్రీటౌన్‌ పరిధిలోని విద్యుత్‌ నగర్‌లో ఒంటరిగా జీవిస్తోన్న ఒక వ్యక్తి అనుమానస్పద స్థితిలో మృతిచెందాడు. తాను ఉంటున్న ఇంటినుంచి దుర్వాసన రావటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా... పోలీసులు ఇంట్లోకి వెళ్ళి చూడగా ఒక వ్యక్తి మృతిచెంది ఉన్నాడు. విద్యుత్‌నగర్‌లో మధుసూధన్‌రెడ్డి (41) ఒంటరిగా అద్దెకు ఉంటూ తాపీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కొన్నేళ్ళ క్రితం భార్యతో విడాకులు తీసుకోవడంతో ఒంటరిగానే జీవిస్తున్నాడు. మధుసూధన్‌రెడ్డి ఉంటున్న ఇంటినుంచి దుర్వాసన రావటంతో స్థానికులు త్రీటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనారోగ్యంతో మృతిచెంది ఉంటాడని పోలీసులు ప్రాఽథమిక అంచనాకు వచ్చారు. మృతదేహాన్ని ఏలూరు జీజీహెచ్‌ మార్చురీకి తరలించారు.

80 వేల నాణేలతో శివలింగం 
1
1/1

80 వేల నాణేలతో శివలింగం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement