బలవంతపు శిక్షణతో సమస్యలు
రెసిడెన్షియల్ విధానంలో విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలనుకోవడం ఆహ్వానించదగిన పరిణామమే. అయితే వారికి ఇష్టం లేకుండా బలవంతంగా హాస్టళ్లలో ఉంచినంత మాత్రాన వారికి చదువు అబ్బుతుందన్న నమ్మకం లేదు. ఇలా ఇచ్చే బలవంతపు శిక్షణ వారిని మానసికంగా కుంగదీసి, అనార్యోగానికి గురి చేసే ప్రమాదం ఉంది. అదే జరిగితే విద్యార్థులు పరీక్షలకు హాజరు కావడం కూడా ప్రశ్నార్థకమవుతుంది.
– కాకి నాని, పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు
రెసిడెన్షియల్ శిక్షణ విధానం విద్యార్థుల భవిష్యత్ కోసమే. వారి తోటి విద్యార్థులు ఉత్తీర్ణులై పై తరగతులకు వెళ్ళి వారు మాత్రం అనుత్తీర్ణులైతే బాధపడేది వారే. నెలరోజుల పాటు హాస్టళ్లలో ఉండి శిక్షణ పొందితే ఉత్తీర్ణులయ్యే అవకాశం ఉంది. కొందరు విద్యార్థులు హాస్టళ్ల నుంచి ఇళ్లకు వెళ్ళిపోవడం వాస్తవమే.
– అరుణ్ కుమార్, ఏలూరు మండల విద్యాశాఖాధికారి–2
బలవంతపు శిక్షణతో సమస్యలు


