శివయ్యకు శ్రీపుష్ప యాగోత్సవం
ద్వారకాతిరుమల: క్షేత్రపాలకుడిగా విరాజిల్లుతోన్న శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామివారి ఆలయంలో బుధవారం జరిగిన విశేష కార్యక్రమాలతో శివయ్య బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ఉదయం దేవస్థానం సిబ్బంది ఆలయాన్ని సుగంధ భరిత పుష్పమాలికలు, మామిడి తోరణాలతో శోభాయమానంగా అలంకరించారు. అనంతరం గర్భాలయంలో కొలువైన శివదేవుడికి అర్చకులు విశేష అభిషేకాలు జరిపారు. ఆ తరువాత అమ్మవార్లకు కుంకుమార్చన నిర్వహించారు. రాత్రి అర్చకులు వేద మంత్రోచ్ఛరణలు, డోలు, సన్నాయి వాద్యాలు, భక్తుల శివనామస్మరణల నడుమ ద్వాదశ కోవెల ప్రదక్షిణను అట్టహాసంగా జరిపారు. అనంతరం స్వామి, అమ్మవార్లకు శ్రీపుష్ప యాగోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. ఆలయ ఈఓ యర్రంశెట్టి భద్రాజీ స్వామి, అమ్మవార్లకు పూలు, పండ్లను సమర్పించారు.
శివయ్యకు శ్రీపుష్ప యాగోత్సవం


