వీఓఏల రణభేరి | - | Sakshi
Sakshi News home page

వీఓఏల రణభేరి

Feb 21 2026 7:31 AM | Updated on Feb 21 2026 7:31 AM

వీఓఏల

వీఓఏల రణభేరి

న్యూస్‌రీల్‌

ప్రధాన డిమాండ్లు

సమస్యల పరిష్కారం కోసం వీఓఏలు (విలేజ్‌ ఆర్గనైజింగ్‌ అసిస్టెంట్లు) పోరుబాట పట్టారు. తమ జీవితాల్లో ‘వెలుగు’లు నింపాలని గళమెత్తారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, జీతాలు పెంచాలని, వేధింపులు నివారించాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 25న చలో విజయవాడ ధర్నాకు పిలుపునిచ్చారు. జిల్లావ్యాప్తంగా పెద్ద సంఖ్యలో వీఓఏలు తరలివెళ్లేందుకు సన్నద్ధమవుతున్నారు.

శనివారం శ్రీ 21 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026

ఏలూరు (టూటౌన్‌): జిల్లాలో 1,300 మంది వీఓఏలు ఉన్నారు. చంద్రబాబు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన ఆరు నెలల వ్యవధిలోనే 86 మందిని ఎటువంటి కారణాలు లేకుండా తొలగించడంతో వీఓఏలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక టీడీపీ నేతలు చెప్పినట్టు వింటేనే విధుల్లో ఉండండి లేకుంటే రాజీనామాలు చేసి వెళ్లిపోండనే బెదిరింపు లు మధ్య మిగిలిన వారు విధులు నిర్వహిస్తున్నా రు. పచ్చ నేతల వేధింపులు తాళలేక ఇప్పటివరకూ 86 మంది వీఓఏలు ఉద్యోగాలు వదులుకున్నారు.

అధికారుల దాటవేత ధోరణి

తమను అక్రమంగా తొలగించారంటూ బాధిత వీఏఓలు జిల్లా అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోని పరిస్థితి. తమను ఈ వ్యవహారంలో తలదూర్చవద్దని ప్రభుత్వం చెప్పిందని, గ్రామ సమాఖ్య తీర్మానం ప్రకారం వీఓఏలను నియమిస్తున్నట్టు డీఆర్‌డీఏ అధికారులు దాటవేత ధోరణిలో సమాధానం ఇస్తున్నారు. రాజకీయ దురద్దేశంతో తమను విధుల నుంచి తొలగించడంపై వీఓఏలు ఆవేదన చెందుతున్నారు. వీఓఏల నెలవారీ వేతనం రూ.8 వేలు కాగా ఇది కూడా ప్రతినెలా అందడం లేదు.

25న చలో విజయవాడ

రాష్ట్రవ్యాప్తంగా వీఓఏలు తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఈనెల 25న చలో విజయవాడకు పిలుపునిచ్చారు. ఏపీ వెలుగు వీఓఏ (యానిమేటర్స్‌) ఉద్యోగుల సంఘం (సీఐటీయూ) పిలుపు మేరకు జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో తరలివెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలి.

రెండేళ్ల సీ్త్రనిధి ఇన్సెంటివ్‌ బకాయిలు చెల్లించాలి.

హెచ్‌ఆర్‌ పాలసీ అమలు చేయాలి.

మొబైల్స్‌, సిమ్‌ కార్డ్స్‌ ఇవ్వాలి. రీచార్జ్‌ చేయించాలి.

మహిళా మార్టుల్లో పొదుపు మహిళలు పెట్టిన పెట్టుబడులు తిరిగి సభ్యులకు చెల్లించాలి.

స్వావలంబన, అభయహస్తం అమౌంట్స్‌ను పొదుపు మహిళలకు తిరిగి చెల్లించాలి.

రూ.10 లక్షల వరకు వడ్డీ రాయితీ చెల్లించాలి.

గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ సౌకర్యం కల్పించాలి.

అక్రమ తొలగింపులు, రాజకీయ వేధింపులు ఆపాలి.

వెలుగు లేని జీవితాలు

సమస్యలపై పోరుబాట

వేధింపులు ఆపాలని డిమాండ్‌

ఉద్యోగ భద్రత కల్పించాలి

25న చలో విజయవాడకు పిలుపు

వీఓఏల రణభేరి 1
1/1

వీఓఏల రణభేరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement