ఎదురుదాడి చేస్తున్నారు
ప్రభుత్వం సమర్థవంతంగా పథకాలు అమలు చేయకుండా అడిగిన వారిపై ఎదురుదాడి చేయడం దారుణం. తల్లికి వందనం పేరుతో అందరినీ మోసం చేస్తున్నారు. డబ్బులు పూర్తిగా తల్లుల ఖాతాల్లో జమ చేయడం లేదు. ఏదొక కారణం చెప్పి కోతలు పెడుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన ప్రకారంగా సొమ్ములు చెల్లించడంలేదు.
– పుప్పాల వాసుబాబు,
ఉంగుటూరు నియోజకవర్గ సమన్వయకర్త
తల్లికి వందనం అమలు తీరు బాధాకరం. ఎన్నికల సమయంలో ఆకర్షించేలా నీకు 15 వేలు.. నీకు 15 వేలు అంటూ వాగ్దానాలు చేశారు. ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఆ పథకాన్ని ఎలా అమలు చేస్తున్నారో తల్లులు గమనిస్తున్నారు. హామీలు ఇచ్చిన వారందరూ మౌనంగా ఉన్నారు. హామీలు ఇచ్చినవారు స్పష్టమైన ప్రకటన చేయాలి.
– కొఠారు అబ్బయ్యచౌదరి,
దెందులూరు నియోజకవర్గ సమన్వయకర్త
కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకం ప్రకటించి అధికారంలోకి వచ్చాక మొదటి సంవత్సరంలో ఒక్క రూపాయి కూడా తల్లుల ఖాతాల్లో జమ చేయలేదు. రెండో సంవత్సరం ప్రకటించిన రూ.15 వేలు కాకుండా తగ్గించి కొంతమందికి రూ. 13వేలు ఖాతాలో జమ చేశారు. కొన్నిచోట్ల అసలు ఒక రూపాయి కూడా వేయలేదు. ఇలా ప్రతి పథకంలోనూ మోసం చేశారు.
కంభం విజయరాజు,
చింతలపూడి నియోజకవర్గ సమన్వయకర్త
ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పినవన్ని పచ్చి అబద్ధాలు. ఎన్నికల సమయంలో అమలు కాని హామీలు ఇస్తారు. తీరా గద్దెనెక్కిన తరువాత వాటిని అమలు చేయరు ఇది చంద్రబాబు నైజం. తల్లి వందనం పేరుతో ఇంట్లో ఎంత మంది ఉంటే అంతమందికి అర్హులైన వారికి ఇస్తానని హామీ ఇచ్చారు. మరోసారి చంద్రబాబు అబద్ధాల కోరని తేలిపోయింది.
– మామిళ్ళపల్లి జయప్రకాష్,
ఏలూరు నియోజకవర్గ సమన్వయకర్త
ఎదురుదాడి చేస్తున్నారు
ఎదురుదాడి చేస్తున్నారు
ఎదురుదాడి చేస్తున్నారు


