అటకెక్కించారు | - | Sakshi
Sakshi News home page

అటకెక్కించారు

Feb 14 2026 7:57 AM | Updated on Feb 14 2026 7:57 AM

అటకెక

అటకెక్కించారు

అటకెక్కించారు హామీ ప్రకారం ఇవ్వాల్సిందే తల్లికి వందనంలో మోసం ●

ఎన్నికల సమయంలో మీకు రూ.15 వేలు.. మీకు రూ.15 వేలు అంటూ కనిపించిన వారందరికీ గొప్పగా చెప్పారు. గద్దెనెక్కిన తరువాత తల్లి వందనం ఎగనామం పెట్టారు. కొందరికి కొర్రీలు పెట్టారు. నిరుద్యోగ భృతి, 50 ఏళ్ళు దాటిన వారికి పింఛన్‌ నెరవేర్చలేదు. ఎన్నికల హామీపై ప్రజలు తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయి.

– దూలం నాగేశ్వరరావు,

వైఎస్సార్‌సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు

టీడీపీ ఎన్నికల ముందు తల్లికి వందనం కింద ప్రతి విద్యార్థికి రూ.15 వేలు ఇస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక మొదటి సంవత్సరం అసలు పథకాన్నే అమలు చేయలేదు. ఇచ్చింది కేవలం రూ.13 వేలు మాత్రమే. కొందరికి రూ.6 వేలు, రూ.7 వేలు మాత్రమే ఇచ్చారు. వచ్చే సంవత్సరం అసలు ఈ పథకం అమలు చేస్తారో లేదోననే అనుమానంతో ప్రజలు ఉన్నారు. మొదటి సంవత్సరం తల్లికి వందనం నగదును కూడా ఇస్తే ప్రజలు సంతోషిస్తారు.

– మేకా వెంకట ప్రతాప్‌ అప్పారావు,

నూజివీడు నియోజకవర్గ సమన్వయకర్త

ఎన్నికల ముందు చంద్రబాబునాయుడు తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఉన్న ప్రతి విద్యార్థికి రూ.15 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి రెండేళ్ళు దాటినా అది అవాస్తవమని తేలిపోయింది. అర్హులైన చాలా మందికి తల్లికి వందనం అందడం లేదు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమ్మ ఒడి పథకంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ నేరుగా తల్లుల ఖాతాల్లో జమ చేశారు. కూటమి ప్రభుత్వం మాత్రం తల్లి వందనం పేరుతో తల్లులను, పిల్లలను మోసం చేస్తున్నారు.

– తెల్లం బాలరాజు,

పోలవరం నియోజకవర్గ సమన్వయకర్త

అటకెక్కించారు  
1
1/2

అటకెక్కించారు

అటకెక్కించారు  
2
2/2

అటకెక్కించారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement