‘ఈ–నారీ’తో పని ఒత్తిడి
ఇటీవల ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పెట్టిన ఈ–నారీ విధానంతో వీఓఏలపై పనిఒత్తిడి పెరిగింది. కోళ్ల యూనిట్లు టార్గెట్లు పెట్టడం తక్షణం నిలుపుదల చేయాలి. జిల్లాలో సరైన కారణాలు లేకుండా వీఓఏలను తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాజకీయ కారణాలతో ఇది జరగడం బాధాకరం.
– సీహెచ్ నాగలక్ష్మి, వీఓఏల సంఘ జిల్లా అధ్యక్షురాలు
వీఓఏలకు ఉద్యోగ భద్రత కల్పించాలి. పని ఒత్తిడి భారాలను తగ్గించాలి. నెలనెలా వేతనాలు అందించాలి. నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలి. తమపై వేధింపులు ఆపాలి. ఆయా సమస్యల పరిష్కారానికి చలో విజయవాడకు పిలుపునిచ్చాం. జిల్లాలోని వీఓఏలు పెద్దసంఖ్యలో పాల్గొనాలి.
– ఎస్‌కే సుభాషిణి,
వీఓఏల సంఘ జిల్లా కార్యదర్శి
రెండేళ్ల నుంచి సీ్త్రనిధి ఇన్సెంటివ్‌లను ఇవ్వలేదు. వెంటనే వీటిని విడుదల చేయాలి. మహిళా మార్టుల్లో స్వయం సహాయక సంఘాల మహిళలు పెట్టిన పొదుపు డబ్బులను తిరిగి చెల్లించాలి. స్వావలంబన, అభయహస్తం పథకాల్లో పొదుపు చేసిన సొమ్ములను మహిళలకు అందించాలి. గ్రూప్ ఇన్సూరెన్స్ కల్పించాలి.
– బి.ఆదిలక్ష్మి, వీఓఏల సంఘ జిల్లా కోశాధికారి
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి. వీఓఏలకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలి. చిన్నపాటి కారణాలతో వీరిపై రాజకీయ నాయకులు పెత్తనం చెలాయిస్తున్నారు. దీనిని నిరోధించాలి. వీఓఏలకు సీ్త్రనిధి ఇన్సెంటివ్ బకాయిలు వెంటనే చెల్లించాలి.
– డీఎన్‌వీడీ ప్రసాద్,
సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి
‘ఈ–నారీ’తో పని ఒత్తిడి
‘ఈ–నారీ’తో పని ఒత్తిడి
‘ఈ–నారీ’తో పని ఒత్తిడి


