బకాయిలు పూర్తి స్థాయిలో చెల్లించాలి
విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు మొత్తం చెల్లించేందుకు వీలుగా బడ్జెట్‌లో కేటాయింపులు లేవు. ఒక పక్క పరీక్షలు సమీపిస్తుండటంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులపై ఫీజుల భారం తలనొప్పిగా మారింది. ఫీజులు చెల్లిస్తేనే హాల్‌టిక్కెట్లు ఇస్తామంటూ యాజమాన్యాలు మెలిక పెట్టడంతో విద్యార్థుల పరిస్థితి అడకత్తెరలో పోక చెక్కలా తయారైంది. రాష్ట్ర వ్యాప్తంగా రూ.9 వేల కోట్లకు పైగా ఫీజుల బకాయిలు పేరుకుపోయాయి.
– కె.లెనిన్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి/ఏలూరు (టూటౌన్)


