చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
ముదినేపల్లి రూరల్: విద్యుత్‌షాక్‌కు గురై చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని బొమ్మినంపాడులో జరిగింది. గ్రామానికి చెందిన యర్రా బిందుమాధవసాయి (30) రొయ్యల చెరువు సాగు చేస్తుంటాడు. గత నెల 28న చెరువు వద్దకు వెళ్లగా ఫ్యాన్ సెట్లు పనిచేయడం లేదని గుర్తించాడు. దీనితో ఎలక్ట్రీషియన్‌ను రప్పించి ఫ్యాన్‌సెట్లకు సంబంధించిన మోటార్‌ను బాగుచేస్తుండగా ప్రమాదవశాత్తూ బిందుమాధవసాయి విద్యుత్‌షాక్‌కు గురయ్యాడు. షాక్‌కు గురైన వెంటనే నీటిలో పడిపోగా ఒడ్డుకు తీసుకునివచ్చి నీళ్లు కక్కించి గుడివాడ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికత్స కోసం విజయవాడ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. బింధుమాధవసాయికి భార్య, ఇద్దరు కుమారులున్నారు. ఈ ప్రమాద ఘటనపై తండ్రి శ్రీరాములు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నూజివీడు: పట్టణంలో యువతిపై దాడిచేసి గాయపరిచిన నిందితుడు బండారు సురేష్‌కుమార్‌ను పట్టణ సీఐ పీ సత్యశ్రీనివాస్ అదుపులోకి తీసుకున్నారు. యువతిపై దాడి చేసిన అనంతరం నిందితుడు విస్సన్నపేట, చాట్రాయి ప్రాంతాలకు పరారయ్యాడు. అక్కడి నుంచి తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లాలోని వేంసూరుకు వెళ్లగా అక్కడ నిందితుడిని సోమవారం రాత్రి సీఐ అదుపులోకి తీసుకుని నూజివీడుకు తరలించారు. దాడికి గల కారణాల గురించి విచారిస్తున్నట్లు తెలిసింది.


