కాయ్‌ రాజా కాయ్‌ | - | Sakshi
Sakshi News home page

కాయ్‌ రాజా కాయ్‌

Feb 23 2026 7:34 AM | Updated on Feb 23 2026 7:34 AM

కాయ్‌ రాజా కాయ్‌

కాయ్‌ రాజా కాయ్‌

సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఏజెన్సీ, మెట్ట ప్రాంతాలు అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారా యి. పోలవరం నియోజకవర్గంలోని కనకాపురం కేంద్రంగా సాగుతున్న జూద క్రీడలు, పక్కా ప్లానింగ్‌తో ‘క్యాసినో’ స్థాయిని తలపిస్తున్నాయి. జీలుగు మిల్లి మండలం కనకాపురానికి చెందిన ఓ కీలక వ్య క్తి ఈ వ్యవహారాన్ని నడిపిస్తుండగా, చట్టాన్ని కాపాడాల్సిన ఓ ‘ఖాకీ’ అధికారి అండదండలు పుష్కలంగా ఉన్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

అటవీ ప్రాంతాలే సేఫ్‌ జోన్లు!

జీలుగుమిల్లి, కనకాపురం, పూచికపాడు, రౌతుగూ డెం, రెడ్డిగణపవరం గ్రామ పరిసరాల్లోని దట్టమైన అటవీ ప్రాంతాలను నిర్వాహకులు ఎంచుకుంటున్నారు. ముఖ్యంగా ఫోన్‌ సిగ్నల్స్‌ అందని ప్రాంతా ల్లో జూద శిబిరాలు నిర్వహిస్తున్నారు. కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం ప్రాంతాలకు చెందిన కొంద రు వ్యక్తులు సిండికేట్‌గా ఏర్పడి, సీతంపేట, బ య్యనగూడెం, లక్కవరం, రామ సింగవరం వంటి గ్రామాల నుంచి ఏజెంట్లు జూదగాళ్లను తరలిస్తున్నారు.

హైటెక్‌ నిఘా: పోలీసుల ఇన్ఫార్మర్‌ వ్యవస్థకు ధీటుగా వీరు తమ సొంత నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకున్నారు.

తనిఖీలు: జూదగాళ్ల వద్ద నుంచి సెల్‌ఫోన్లు స్వాధీ నం చేసుకుని, క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే ఆటోల్లో రహస్య ప్రాంతాలకు తరలిస్తారు.

సిగ్నల్స్‌: ఎవరైనా అనుమానితులు లేదా పోలీసులు వస్తున్నట్టు తెలిస్తే, గాలిలోకి బాణసంచా పేల్చి 5–6 కిలోమీటర్ల పరిధిలోని జూదగాళ్లను అప్రమత్తం చేస్తారు.

ఆటోల్లో ప్రయాణం: ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారు తమ ఖరీదైన కార్లను మండల కేంద్రాల్లోనే వదిలి, నిర్వాహకులు ఏర్పాటు చేసిన ఆటోల్లో ప్రయాణించాల్సి ఉంటుంది.

మందు.. విందు.. చిందు: కేవలం జూదమే కాకుండా, పెద్ద ఎత్తున విందు వినోదాలు కూడా ఏర్పాటు చేస్తున్నట్టు సమాచారం. ఈనెల 7న రాజమండ్రిలో, 9న బుట్టాయగూడెం సమీపంలోని పోగొండ వాటర్‌ ఫాల్స్‌ వద్ద పట్టణాల నుంచి తెచ్చిన యువతులతో భారీ పార్టీలు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ ఉదంతంలో ఓ పోలీసు అధికారి భారీగా మామూళ్లు అందుకున్నారని, నెలకు రూ.10 లక్షలతో పాటు ఇతర రాష్ట్రాల జూదగాళ్ల నుంచి సుమారు రూ.50 లక్షల వరకు వసూలు చేస్తున్నార నే ప్రచారం స్థానికంగా పెద్దఎత్తున జరుగుతోంది.

గంజాయి మత్తు..

జూదం ముఠాల కన్ను ఇప్పుడు గంజాయి విక్రయాలపై పడింది. ఏజెన్సీ, మెట్ట ప్రాంతాల్లో గంజాయి ప్యాకెట్లు విక్రయిస్తుండటంతో స్థానిక యువత వ్యసనాలకు బానిసలవుతున్నారు. తమ బిడ్డల భవిష్యత్తు నాశనమవుతోందని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపా దం మోపాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

ఖాకీల అండతో కనకాపురంలో ‘క్యాసినో’

ఏజెన్సీ, మెట్ట ప్రాంతాల్లో యథేచ్ఛగా జూదం

రూ.కోట్లలో చేతులు మారుతున్న నగదు

ఇన్ఫార్మర్ల వ్యవస్థ.. బాణసంచా సిగ్నల్స్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement