మందకొడిగా ఆస్తి పన్ను వసూళ్లు | - | Sakshi
Sakshi News home page

మందకొడిగా ఆస్తి పన్ను వసూళ్లు

Feb 11 2026 7:40 AM | Updated on Feb 11 2026 7:40 AM

మందకొ

మందకొడిగా ఆస్తి పన్ను వసూళ్లు

స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నాం

జంగారెడ్డిగూడెం: ఏలూరు జిల్లాలో ఆయా మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను వసూళ్లు మందకొడిగా సాగుతున్నాయి. ఆర్థిక సంవత్సరం సుమారు 50 రోజుల్లో ముగుస్తుండగా పన్ను వసూళ్లు మాత్రం ముందుకు సాగడం లేదు. జిల్లాలో 4 మున్సిపాలిటీలు ఉండగా, ఏలూరు కార్పొరేషన్‌, చింతలపూడి నగర పంచాయతీలుగా ఉన్నాయి. వీటిలో మొత్తం అసెస్‌మెంట్లు 1,15,903 ఉండగా, మొత్తంగా రూ. 96.02 కోట్లు ఆస్తి పన్ను వసూలు కావాల్సి ఉంది. వీటిలో పాత బకాయిలు కలిసి ఉన్నాయి. ఇంతవరకు రూ. 31.19 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. మొత్తం మీద 37.2 శాతం ఆస్తి పన్నులు వసూలయ్యాయి. ఆయా మున్సిపాలిటీల్లో ఇంటి పన్నులు, ఖాళీ స్థలాల పన్నులు, కేంద్ర, రాష్ట్ర కార్యాలయాల పన్నులు కలిసి ఉన్నాయి. మొత్తం 1,15,903 అసెస్‌మెంట్‌లు ఉన్నాయి. ఇంత వరకు పన్నుల వసూళ్ళలో జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ 41.11 శాతం వసూళ్లతో ప్రథమస్థానంలో ఉండగా, ఏలూరు కార్పొరేషన్‌ 36.28 శాతంతో చివరి స్థానంలో ఉంది. చింతలపూడి నగరపంచాయతీ 39.49 శాతంతో రెండో స్థానం, నూజివీడు 37.68 శాతంతో మూడో స్థానంలో నిలిచాయి.

మున్సిపాలిటీలు వసూలు వసూలైనది

కావాల్సినది

(రూ.కోట్లలో) (రూ.కోట్లలో)

జంగారెడ్డిగూడెం 13.22 5.43

చింతలపూడి 2.79 1.10

నూజివీడు 11.04 4.16

ఏలూరు 68.97 25.02

(కార్పొరేషన్‌)

మొత్తం 96.02 35.71

సచివాలయాల వారీగా ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశాం. పట్టణంలో మైక్‌ ద్వారా ఆస్తి పన్ను చెల్లించాలని ప్రచారం చేస్తున్నాం. ఆస్తి పన్ను చెల్లించాలని డిమాండ్‌ నోటీసు జారీ చేశాం. ఆర్థిక సంవత్సరం చివరి నాటికి పన్ను వసూళ్లకు ప్రణాళికలతో ముందుకు సాగుతున్నాం. పన్ను వసూళ్లలో ఎలాంటి అలసత్వం వహించవద్దని ఆదేశాలు జారీ చేశాం. ప్రజలు కూడా సకాలంలో పన్నులు చెల్లించి పట్టణాభివృద్ధికి సహకరించాలి.

– కేవీ రమణ,

మున్సిపల్‌ కమిషనర్‌, జంగారెడ్డిగూడెం

మందకొడిగా ఆస్తి పన్ను వసూళ్లు 1
1/1

మందకొడిగా ఆస్తి పన్ను వసూళ్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement