శ్రీవారి ఆలయంలో కొనసాగిన భక్తుల రద్దీ | - | Sakshi
Sakshi News home page

శ్రీవారి ఆలయంలో కొనసాగిన భక్తుల రద్దీ

Feb 23 2026 7:35 AM | Updated on Feb 23 2026 7:35 AM

శ్రీవ

శ్రీవారి ఆలయంలో కొనసాగిన భక్తుల రద్దీ

ద్వారకాతిరుమల: శ్రీవారి దివ్య క్షేత్రంలో ఆదివారం భక్తుల రద్దీ కొనసాగింది. సెలవుదినం కావడంతో వేలాది మంది భక్తులు ఆలయానికి తరలివచ్చారు. దాంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిశాయి. దర్శనం క్యూలైన్లు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌, కల్యాణకట్ట, నిత్యాన్నదానం, తదితర విభాగాలు భక్తులతో పోటెత్తాయి. ఇదిలా ఉంటే ఉదయం శ్రీవారి క్షేత్రంలో భారీగా వివాహాలు జరిగాయి. అందులో భాగంగా ఆలయ తూర్పురాజగోపుర ప్రాంతంలోని అనివేటి మండపంలో అధికంగా పెళ్లిళ్లు జరిగాయి. దాంతో క్షేత్రంలో పెళ్లి సందడి నెలకొంది. వివాహాల అనంతరం నూతన వధువరులు, వారి బంధువులు స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. అలాగే వివిధ ప్రాంతాల్లో వివాహాలు చేసుకున్న వారు సైతం ఆలయానికి వచ్చి శ్రీవారిని దర్శించుకున్నారు.

శ్రీవారి ఆలయంలో కొనసాగిన భక్తుల రద్దీ 1
1/1

శ్రీవారి ఆలయంలో కొనసాగిన భక్తుల రద్దీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement