కూటమిది కక్ష సాధింపుల పాలన
ద్వారకాతిరుమల: కూటమి ప్రభుత్వం ప్రజాపాలనను పక్కనపెట్టి, వైఎస్సార్ సీపీ నాయకులపై కక్ష సాధింపు పాలన సాగిస్తోందని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. కూటమి ప్రభుత్వ అక్రమ కేసుల కారణంగా జైలుకెళ్లిన ఆయన బెయిల్‌పై విడుదలై గురువారం ఉదయం రాజమండ్రి నుంచి భారీ కార్ల ర్యాలీతో గుంటూరుకు పయనమయ్యారు. ఈ సందర్భంగా మార్గమధ్యలో భీమడో లు మండలం పోలసానిపల్లి వద్ద జాతీయ రహదారిపై మాజీ హోం మంత్రి, వైఎస్సార్ సీపీ గోపాలపురం నియోజకవర్గ ఇన్‌చార్జి తానేటి వనిత ఆధ్వర్యంలో భీమవరం, రాజమండ్రి రూరల్, కొవ్వూరు పార్టీ ఇన్‌చార్జులు చినమిల్లి వెంకటరాయుడు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, తలారి వెంకట్రావు, ద్వారకాతిరుమల మండల పార్టీ నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ పార్టీ శ్రేణులు తనపై చూ పుతున్న ఆధరాభిమానాలను మరువలేనన్నారు. అనంతరం వనిత మాట్లాడుతూ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై కేసులు పెట్టడం, అరెస్టులు చేయడం సాధారణంగా మారిందన్నారు. డైవర్షన్ పాలిటిక్స్‌లో ఇదో భాగమైందని, కేసులకు తమ పార్టీ నాయకులు, కార్యకర్తలు భయపడరని అన్నా రు. నాయకులు దాకారపు బంగారమ్మ, తాండ్ర రమేష్‌బాబు, పెద్దిరెడ్డి జ్యోతి శ్రీనివాస్, బొండాడ వెంకన్నబాబు, దాసరి రాంబాబు, ప్రత్తిపాటి యో హాను, గుమ్మడి శ్రీను, ఉక్కుర్తి వెంకట్రావు, చి లుకూరి చంద్రం తదితరులు ఉన్నారు.
మాజీ మంత్రి అంబటి రాంబాబు


