విజయీభవ
పరీక్షల షెడ్యూల్
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : ఉమ్మడి జిల్లాలో ఇంటర్మీడియెట్ పబ్లిక్ థియరీ పరీక్షలకు సర్వం సిద్ధమైంది. సో మవారం నుంచి ప్రథమ సంవత్సరం, మంగళవారం నుంచి ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేయడంతో పాటు హాల్‌టికెట్లు కూడా వెబ్‌సైట్, వాట్సాప్‌లలో అందుబాటులో ఉంచింది. ఇక విద్యార్థులు తాము చదివిన చదవునంతా జవాబుపత్రాలపై పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. ఉన్నత విద్య చదవాలనుకునే విద్యార్థులకు తొలి మెట్టు అయిన ఈ పరీక్షల్లో చూపిన ప్రతిభ ఆధారంగానే వారు భవిష్యత్‌లో తమ లక్ష్యాలను చేరుకోవడానికి సోపానం ఏర్పడుతుంది. వచ్చేనెల 24 వరకు పరీక్షలు జరుగనున్నాయి.
ఉమ్మడి జిల్లాలో 109 పరీక్షా కేంద్రాలు
ఏలూరు జిల్లాలో ప్రథమ సంవత్సరం పరీక్షలకు 17,556 మంది, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 17,059 మంది మొత్తంగా 34,615 మంది హాజరుకానున్నారు. ఈ మేరకు ఏలూరు జిల్లాలో 56 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షా పత్రాలను పంపిణీకి 21 స్టోరేజ్ పాయింట్లను సిద్ధం చేశారు. ఆయా రోజుల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి.
పశ్చిమగోదావరి జిల్లాలో ప్రథమ సంవత్సరం 19,662 మంది, ద్వితీయ సంవత్సరం 17,888 మొత్తంగా 37,550 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఈ మేరకు జిల్లావ్యాప్తంగా 53 కేంద్రాలను ఏర్పాటుచేశారు.
800 మంది ఇన్విజిలేటర్లు
పరీక్షల నిర్వహణకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లను ఇంటర్మీడియెట్ బోర్డు అధికారులు పూర్తి చేశారు. ఏలూరు జిల్లాలో పరీక్షల నిర్వహణ కోసం మూడు ఫ్లయింగ్ స్క్వాడ్లు, రెండు సిట్టింగ్ స్క్వాడ్లను నియమించారు. పరీక్షా కేంద్రాల్లో 1,006 సీసీ కెమెరాలు ఏర్పాటుచేశారు. 800 మంది ఇన్విజిలేటర్లు పరీక్షల విధుల్లో పాల్గొంటారు. జిల్లా కేంద్రం ఏలూరులో 17 సెంటర్లు ఉన్నాయి. ఆరు సెంటర్లలో ప్రహరీ గోడలు లేకపోవడంతో అక్కడ మ రింత పకడ్బందీగా పరీక్షలు నిర్వహించడానికి భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు.
ఒక్క నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
ఇంటర్ పరీక్షలకు ఎంసెట్, నీట్ మాదిరిగా ఒక్క నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించరు. కాగా ఉదయం 8.30 గంటల నుంచే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి కేంద్రాల్లో చేస్తున్న ఏర్పాట్లను ఇంటర్మీడియెట్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి కె.యోహాన్ పర్యవేక్షించి అధికారులకు సూచనలు జారీ చేశారు.
ద్వితీయ సంవ్సతరం
24న.. సెకండ్ లాంగ్వేజ్–2
26న.. ఇంగిష్–2
28న.. బోటనీ, హిస్టరీ–2
మార్చి 4న.. లెక్కలు–2ఏ, సివిక్స్–2
మార్చి 6న.. జువాలజీ, ఎకనామిక్స్–2
మార్చి 9న.. లెక్కలు–2బీ
మార్చి 11న.. కామర్స్, సోషియాలజీ, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్–2
మార్చి 13న.. ఫిజిక్స్–2
మార్చి 16న.. మోడరన్ లాంగ్వేజ్–2, జియోగ్రఫీ–2
మార్చి 18న.. కెమిస్ట్రీ–2
మార్చి 23న.. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లాజిక్–2
ఆల్ ద బెస్ట్
నేటి నుంచి ఇంటర్ పరీక్షలు
కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి
వచ్చేనెల 24 వరకు నిర్వహణ
ఉమ్మడి జిల్లాలో 72,165 మంది విద్యార్థులు
ప్రథమ సంవత్సరం
23న.. తెలుగు, సంస్కృతం, ఉర్దూ, హిందీ
25న.. ఇంగ్లిష్–1
27న.. హిస్టరీ, బోటనీ–1,
మార్చి 2న.. లెక్కలు–1
మార్చి 5న.. బయోలజీ–1, జువాలజీ–1
మార్చి 7న.. ఎకనామిక్స్–1
మార్చి 10న.. ఫిజిక్స్–1
మార్చి 12న.. కామర్స్, సోషియాలజీ, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్–1
మార్చి 14న.. సివిక్స్–1
మార్చి 17న.. కెమిస్ట్రీ–1
మార్చి 21న.. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్–1
మార్చి 24న.. మోడల్ లాంగ్వేజ్, జాగ్రఫీ–1


