ఊసెత్తకపోవడం దారుణం | - | Sakshi
Sakshi News home page

ఊసెత్తకపోవడం దారుణం

Feb 17 2026 7:47 AM | Updated on Feb 17 2026 7:47 AM

ఊసెత్

ఊసెత్తకపోవడం దారుణం

ఊసెత్తకపోవడం దారుణం నమ్మించి వంచించారు మొండిచేయి చూపారు

నిరుద్యోగ భృతి హామీని నిలబెట్టుకోవాలి. ఒక్క ఏలూరు నగరంలోనే దాదా పు 35 వేల మంది నిరుద్యోగులకు నెలకు రూ.10.50 కోట్లు చెల్లించాలి. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు పూర్తయినా నిరుద్యోగ భృతి ఊసెత్తకపోవడం దారుణం. దీనిపై పెద్ద ఎత్తున నిరుద్యోగులను సమీకరించి ఆందోళనలు చేపడతాం.

– పాతిన వలస రాజేష్‌, వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు

నిరుద్యోగ భృతి వస్తే కోచింగ్‌ ఫీజులకో లేదా కనీస అవసరాలకో ఉపయోగపడుతుందని నమ్మిన యువతకు ఈ బడ్జెట్‌ మొండిచేయి చూపింది. రాష్ట్ర బడ్జెట్‌ నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లింది. నిరుద్యోగ భృతి ప్రస్తావనే లేకపోవడం దారుణం. ఉపాధి అవకాశాల కల్పనపై కూడా స్పష్టత లేకపోవడం సరికాదు.

– బి.రాంబాబు నాయక్‌, ఎంపీపీ, చింతలపూడి మండల పరిషత్‌

మరోసారి బడ్జెట్‌లో నిరుద్యోగులకు మొండిచేయి చూపారు. డిగ్రీలు పట్టుకుని ఏళ్ల తరబడి నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న యువతకు ఈ బడ్జెట్‌ మరో కోలుకోలేని దెబ్బ. నిరుద్యోగుల శ్రేయస్సు కోసం ప్రభుత్వం ఎందుకు ఆలోచించడం లేదు. బడ్జెట్‌ అంకెల గారడీగా ఉంది.

– కె.దినేష్‌రెడ్డి, రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి, చింతలపూడి

ఊసెత్తకపోవడం దారుణం 
1
1/2

ఊసెత్తకపోవడం దారుణం

ఊసెత్తకపోవడం దారుణం 
2
2/2

ఊసెత్తకపోవడం దారుణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement