మోటార్ల దొంగల అరెస్ట్
పెదపాడు: గత కొద్ది రోజులుగా చేపల చెరువల వద్ద మోటార్ల చోరీకి పాల్పడుతున్న దొంగలు పోలీసులకు చిక్కారు. నేరాలకు పాల్పడుతున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసి వారి నుంచి 7 మోటార్లు స్వాధీనం చేసకున్నారు. పెదవేగి సీఐ సీహెచ్ రాజశేఖర్, ఎస్సై ఆర్ శ్రీనివాస్ మంగళవారం వివరాలు వెల్లడించారు. పెదపాడు మండలంలోని గుడిపాడు గ్రామానికి చెందిన చొక్కా నాగదుర్గారావు అలియాస్ పెంటయ్య, అదే గ్రామానికి చెందిన చింతపల్లి నాగరాజు, సత్యవోలు గ్రామానికి చెందిన బొత్స వినోద్ వడ్డిగూడెం గ్రామ శివారున రాళ్లపల్లివారి పాలెం కల్వర్టు సమీపంలో అనుమానాస్పదంగా సంచరిస్తుండగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఈనెల 6 నుంచి 9వ తేదీ వరకు వడ్డిగూడెం, సత్యవోలు, గుడిపాడు పరిసర ప్రాంతాల్లో చేపల చెరువుల వద్ద మోటార్ల చోరీకి పాల్పడుతున్నట్లు అంగీకరించారు. కొన్ని మోటార్లను తుప్పల్లో దాచగా, మిగిలినవి డ్రైవర్ వినోద్‌కు విక్రయించినట్లు వెల్లడించారు.
ఆకివీడు: అదనపు కట్నం వేధింపులపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో బుధవారం కేసు నమోదైంది. మండలంలోని దుంపగడప గ్రామానికి చెందిన నక్క మరియమ్మకు కోనసీమ జిల్లా రామచంద్రాపురానికి చెందిన గంట సురేష్‌కుమార్‌తో 2025 అక్టోబర్‌లో వివాహమైంది. అప్పటి నుంచి భర్త, అతని కుటుంబ సభ్యులు అదనపు కట్నం కోసం వేధిస్తున్నట్లు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై హెచ్.నాగరాజు చెప్పారు.


