ఖాతాదారుల అవసరాలకు అనుగుణంగా సేవలు
తాడేపల్లిగూడెం: ఖాతాదారుల అవసరాలకు అనుగుణంగా సేవలను విస్తరించడమే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లక్ష్యమని బ్యాంకు ముంబై సెంట్రల్ ఆఫీస్ జనరల్ మేనేజర్ డాక్టర్ జి.భాస్కర్ తెలిపారు. బ్యాంకు ఆధ్వర్యంలో శుక్రవారం మాగంటి కల్యాణ మండపంలోని మెగా అగ్రికల్చరల్ క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో బాస్కర్ మాట్లాడుతూ వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తూ రుణాలను అందిస్తున్నామన్నారు. అనంతరం రైతులకు రూ.80 కోట్ల విలువైన రుణ మంజూరు పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో విజయవాడ రీజినల్ మేనేజర్ పి.సతీష్‌బాబు, డాల్ఫిన్స్ గ్రూపు సీఈఓ డి.లీలాకృష్ణ, స్థానిక బ్యాంకు మేనేజర్ షేక్ కరీం పాల్గొన్నారు. అలాగే ఈ నెల 21న రిటైల్ క్రెడిట్ అవుట్ రీచ్ క్యాంపెయిన్ నిర్వహించనున్నట్టు తెలిపారు.


