కలికితురాయిపై కక్ష | - | Sakshi
Sakshi News home page

కలికితురాయిపై కక్ష

Feb 21 2026 7:31 AM | Updated on Feb 21 2026 7:31 AM

కలికితురాయిపై కక్ష

కలికితురాయిపై కక్ష

కలికితురాయిపై కక్ష

పెదవేగి : పెదవేగి మండల కేంద్రంలో 140 ఏళ్ల వయసున్న తురాయి చెట్టును కూలగొట్టడం చర్చనీయాంశంగా మారింది. చెట్టు ఉన్న ప్రాంతం తు రాయి చెట్టు సెంటర్‌గా పేర్గాంచింది. పంచాయతీ అధికారులకు తెలియకుండా శివరాత్రి రోజున ఈ చెట్టును కొందరు కూలగొట్టారు. దీనిపై సమాధానం చెప్పే నాథుడే కరువయ్యాడు. ఇదిలా ఉండ గా చెట్టు తొలగింపు తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్‌ సీపీల మధ్య వాగ్వాదానికి దారితీసింది. ఇక్కడ వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహం ఉండటంతో అదే ప్రాంతంలో ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఏర్పాటుచేయాలని భావించి చెట్టును తొలగించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఇక్కడ ఆంజనేయస్వామి విగ్రహాన్ని వైఎస్సార్‌సీపీ నాయకులు ఏర్పాటుచేశారు. అయితే ఇది ప్రభుత్వ స్థలం అని పోలీసులు జోక్యం చేసుకుని ఆంజనేయస్వామి విగ్రహాన్ని తొలగించారు. అలాగే విగ్రహం ఏర్పాటుచేసిన వారికి నోటీసులు కూడా ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement