రెండు నెలలుగా జీతాల్లేవు | - | Sakshi
Sakshi News home page

రెండు నెలలుగా జీతాల్లేవు

Feb 16 2026 7:31 AM | Updated on Feb 16 2026 7:31 AM

రెండు నెలలుగా జీతాల్లేవు

రెండు నెలలుగా జీతాల్లేవు

మీటరు రీడర్ల ఆవేదన

చర్యలు తీసుకుంటున్నాం

రాతపై కుస్తీ తప్పనిసరి

భీమవరం(ప్రకాశం చౌక్‌): విద్యుత్‌ శాఖలో స్పాట్‌ మీటర రీడర్లు జీవితాలతో కూటమి ప్రభుత్వం అడుకుంటుంది. ప్రభుత్వం, విద్యుత్‌ శాఖ అధికారుల నిర్లక్ష్యాన్ని ఆసరాగా తీసుకుని కాంట్రాక్టర్లు గత రెండు నెలలగా జీతాలు చెల్లించడం లేదు. జిల్లాలోని పెద తాడేపల్లి, నర్సాపురం, తణుకు సబ్‌ డివిజన్‌లోని 100 మందికి రెండు నెలలగా జీతాలు ఇవ్వకుండా మీటర్‌ రీడింగ్‌ పనులు చేయిస్తున్నారు.

పెద తాడేపల్లి, తణుకు నర్సాపురం సబ్‌ డివిజన్‌లో..

పెద తాడేపల్లి, నర్సాపురం, తణుకు సబ్‌ డివిజన్‌ల్లో మీటర్లు రీడర్లు 100 మంది ఉన్నారు. వారికి గత రెండు నెలలగా జీతాలు బ్యాంకు ద్వారా చెల్లించకుండా కాంట్రాక్టరు ఇబ్బందులు పెడుతున్నారు. దాంతో రీడర్లు నర్సాపురం, తాడేపల్లి డీఈల వద్ద మొరపెట్టకున్నారు. ఇప్పటికే రీడర్లుకు రెండు నెలల జీతాలు లేవు. మరో వారం రోజుల మూడో నెల వస్తుంది.

పీఎఫ్‌, ఈఎస్‌ఐ మినహాయింపు లేదు

జీతాలతో పాటు ప్రతి నెల పీఎఫ్‌, ఈఎస్‌ఐ కూడా కాంట్రాక్టర్‌ చెల్లించాలి. ఈ రెండు నెలలు జీతాలు చెల్లించకపోవడంతో పాటు పీఎఫ్‌, ఈఎస్‌ఐ కూడా చెల్లించడం లేదు. దాంతో మీటర్‌ రీడర్‌కు ప్రమాదం జరిగితే అతను, అతనిపై ఆధారపడిన కుటుంబం నష్టపోతారు. ఈ విషయం తెలిసి కూడా కూటమి ప్రభుత్వం, అధికారులు పట్టించుకోవడం లేదు.

గత ప్రభుత్వంలో సకాలంలో జీతాలు

గత ప్రభుత్వంలో విద్యుత్‌ శాఖలోని స్పాట్‌మీటర్‌ రీడర్లుకు ప్రతి నెల ఒకటో తేదీ జీతాలు బ్యాంకు ద్వారా జమ చేసేవారు. ప్రభుత్వం కాంట్రాక్టర్లు, విద్యుత్‌ శాఖ అధికారులను సమన్వయం చేసి మీటర్‌ రీడింగ్‌ సకాలంలో జరిగేలా, మీటర్లు రీడర్లుకు జీతాలు పెడింగ్‌ లేకుండా సకాలంలో అందేలా పనిచేసేవారు. కాంట్రాక్టర్లు, అధికారుల మధ్య అవినీతి జగరకుండా చర్యలు తీసుకుని మీటర్‌ రీడర్లకు ఇబ్బందులు లేకుండా చూసేవారు.

తీవ్ర ఇబ్బందులు పడుతున్న రీడర్లు

గత రెండు నెలలగా జీతాలు రాక మీటర్‌ రీడర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కొక్కరి సుమారు రూ.50 వేల వరకు జీతాలు చెల్లించాల్సి ఉంది. జీతాలు రాక ఈఎంఐలు, ఇంటి అద్దెకు, కుటుంబ పోషణకు మీటర్‌ రీడర్లు అప్పులు చేస్తున్నారు. ఒక్కొక్క మీటర్‌ రీడర్‌ 5 వేల సర్వీసులు బిల్లింగ్‌ చేసి వియోగదారులకు సకాలంలో బిల్లు అందిస్తారు. దాంతో వినియోగదారులు సకాలంలో బిల్లు చెల్లిస్తారు.

మూడు డివిజన్‌ల్లో మీటర్‌ రీడర్లుకు పెడింగ్‌లో ఉన్న జీతాలు వెంటనే బ్యాంకు ద్వారా జమ చేయాలని కాంట్రాక్టర్లు అదేశించాం. నిబంధనలకు విరుద్దంగా కాంట్రాక్టర్లు మీటర్లు రీడర్లుకు నగదు రూపంలో జీతాలు చెల్లించకూడదు.

– పి.ఉషారాణి, విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ

వ్యాకరణ దోషాలు లేకుండా చూసుకోవాలి.

దిద్దుబాటు, గజిబిజి ఉండకూడదు. పదానికి పదానికి మద్య దూరం ఉండాలి

చేతి రాత గుండ్రంగా, అర్థమయ్యేలా ఉండాలి.

సమాధాన పత్రంలో పేజీకి 15– 16 లైన్లు ఉండాలి.

పేజీకి పైన, కింద మార్జిన్‌ విడిచి పెట్టాలి.

మొదటి వరుసలో ఎంత బాగా రాసారో చివరి వరకు అదే దస్తూరి కొనసాగించాలి.

తెలుగు, ఆంగ్లం, హిందీ సబ్జెక్టులలో లెటర్‌ రైటింగ్‌ ఒకే పేజీలో వచ్చేలా రాయాలి.

అక్షర దోషాలు, దిద్దుబాట్లు లేకుండా చూసుకోవాలి

గణితంలో అంకెలు స్పష్టంగా ఉండాలి. కొట్టివేతలు వస్తే మార్కులు తగ్గుతాయి.

సాంఘికశాస్త్రంలో సమాధానాలు పాయింట్ల వారీగా రాయాలి. శీర్షికలు, ఉప శీర్షికలు కింద అండర్‌లైన్‌ చేయాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement