నోరు అదుపులో పెట్టుకో! | - | Sakshi
Sakshi News home page

నోరు అదుపులో పెట్టుకో!

Feb 19 2026 9:57 AM | Updated on Feb 19 2026 9:57 AM

నోరు అదుపులో పెట్టుకో!

నోరు అదుపులో పెట్టుకో!

నోరు అదుపులో పెట్టుకో!

కిరాక్‌ ఆర్‌పీపై బీసీ నేతల ఫైర్‌

ఏలూరు టౌన్‌: కామెడీ చేసుకునే కిరాక్‌ ఆర్‌పీ... నోరు అదుపులో పెట్టుకోవాలని వైఎస్సార్‌సీపీ ఏలూరు నగర అధ్యక్షులు గుడిదేశి శ్రీనివాసరావు హెచ్చరించారు. ఉత్తరాంధ్ర భాషపై వెకిలిచేష్టలు చేయడం, వైఎస్సార్‌సీపీ మండలి పక్ష నేత బొత్స సత్యనారాయణను బాడీ షేమింగ్‌ చేస్తూ... ఆయనపై వ్యంగ్యంగా మాట్లాడడాన్ని తప్పుపట్టారు. ఏలూరులోని పార్టీ కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు నెరుసు చిరంజీవి, రాష్ట్ర మహిళ ప్రధాన కార్యదర్శి తుమరాడ స్రవంతి, జిల్లా అధికార ప్రతినిధి మున్నుల జాన్‌గురునాథ్‌తో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తూర్పు కాపులకు ఎనలేని సేవలు చేసిన బొత్స సత్యనారాయణపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో తమ మనోభావాలను దెబ్బతీశారని ఆవేదన వ్యక్తం చేశారు. కిరాక్‌ ఆర్‌పీ తన స్థాయి ఏంటో తెలుసుకోవాలని హెచ్చరించారు. అతనిది నీచమైన సంస్కృతి అని నగర అధ్యక్షుడు గుడిదేశి విమర్శించారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ నాయకులు బుద్దాల రాము, సాసుపల్లి యుగంధర్‌ప్రసాద్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి లంకలపల్లి గణేష్‌, తూర్పుకాపు నేతలు హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement