వైఎస్సార్‌సీపీ నేత కారు అద్దాలు ధ్వంసం | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ నేత కారు అద్దాలు ధ్వంసం

Feb 12 2026 7:30 AM | Updated on Feb 12 2026 7:30 AM

వైఎస్సార్‌సీపీ నేత కారు అద్దాలు ధ్వంసం

వైఎస్సార్‌సీపీ నేత కారు అద్దాలు ధ్వంసం

వైఎస్సార్‌సీపీ నేత కారు అద్దాలు ధ్వంసం

వైఎస్సార్‌సీపీ నాయకుల నిరసన

ఉంగుటూరు: వైఎస్సార్‌సీపీ నాయకుడు, మాజీ సర్పంచి దంతంశెట్టి సత్యనారాయణ కారు అద్దాలు గుర్తు తెలియని వ్యక్తులు పగుల కొట్టారు. తన ఇంటి దగ్గరలో పార్కు చేసిన కారు వెనుక అద్దాలను మంగళవారం రాత్రి పగుల కొట్టడంతో చేబ్రోలు పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేశారు. వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు మరడా మంగారావు, బూత్‌ వింగ్‌ రాష్ట్ర కార్యదర్శి ఎలిశెట్టి పాపారావు బాబ్జి, బీసీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి పెనుగొండ బాలకృష్ణ, ఎంపీటీసీ చాంబర్‌ అధ్యక్షుడు బండారు నాగరాజు, పంచాయతీరాజ్‌ విభాగం జిల్లా అధ్యక్షుడు పుప్పాల గోపి ,మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మందా జయలక్ష్మి, పార్టీ బీసీ నాయకుడు రమణ తదితరులు ఈ ఘటనను ఖండించారు. దంతంశెట్టిని పరామర్శించారు. వైఎస్సార్‌సీపీకి అండగా నిలుస్తున్న దొంతంశెట్టి కారు అద్దాలు పగలగొట్టడం పలు అనుమానాలకు తావిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement