అబార్షన్లు ఆందోళనకరం | - | Sakshi
Sakshi News home page

అబార్షన్లు ఆందోళనకరం

Feb 18 2026 7:19 AM | Updated on Feb 18 2026 7:19 AM

అబార్

అబార్షన్లు ఆందోళనకరం

అబార్షన్లు ఆందోళనకరం జిల్లా చెస్‌ జట్ల ఎంపిక నాగేంద్రసింగ్‌కు అవార్డు

బుట్టాయగూడెం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తల్లీబిడ్డల ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నా గిరిజన ప్రాంతంలో 281 అబార్షన్‌లు నమోదు కావడం ఆందోళనకరమని, దీనిపై సమగ్ర నివేదిక తయారు చేసి కలెక్టర్‌కు అందజేయాలని అధికారులను ఆదేశించినట్లు రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ రాయపాటి శైలజ చెప్పారు. మంగళవారం ఆమె బుట్టాయగూడెం మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా కేఆర్‌పురం ఐటీడీఏ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో అబార్షన్‌లపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నందాపురం పీహెచ్‌సీని సందర్శించి గర్భవతులకు అందిస్తున్న వైద్యసేవలపై ఆరా తీశారు. ఏపీ ట్రైకార్‌ చైర్మన్‌ బొరగం శ్రీనివాసులు, ఐటీడీఏ పీఓ కె.రాములు నాయక్‌, డీఎం అండ్‌ హెచ్‌ఓ డాక్టర్‌ పీజె అమృతం, ఐసీడీఎస్‌ పీడీ శారద, డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌ఓ జె.సురేష్‌, ఐటీడీఏ అధికారులు, డాక్టర్‌లు పాల్గొన్నారు.

ఏలూరు రూరల్‌: త్వరలో తిరుపతిలో జరగబోయే శాప్‌ లీగ్స్‌ రాష్ట్రస్థాయి చెస్‌ పోటీలకు జిల్లా జట్లను ఎంపిక చేశామని డీఎస్‌డీఓ ఎస్‌ఏ అజీజ్‌ చెప్పారు. మంగళవారం ఏలూరు ఇండోర్‌ స్టేడియం వెయిట్‌లిఫ్టింగ్‌ హాల్లో జిల్లాస్థాయి చెస్‌ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో అండర్‌–13, 15, 19 బాలికల విభాగంలో వరుసగా వై ప్రేమ్‌రక్షిత్‌, చార్వి శ్రీ, వై ముకుంధప్రియ, డి జ్యోతికశ్రీదేవి, అల్లూరి తేజ, డి హారిణికతి బాలుర అండర్‌–17, 19 విభాగంలో కె తేజేష్‌సాయి, ఆర్‌ చింటు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని డీఎస్‌డీవో వెల్లడించారు. రాష్ట్ర ఒలింపిక్‌ అసోసియేషన్‌ కార్యదర్శి బడేటి వెంకట్రామయ్య, సెట్‌వెల్‌ సీఈఓ కె ప్రభాకర్‌, ఎస్టీఎఫ్‌ కార్యదర్శి కె అలివేలు, చెస్‌ అకాడమీ సభ్యులు పాల్గొన్నారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు అహర్నిశలు పాటుపడిన ఉపాధ్యాయుడు రాజ్‌పుట్‌ నాగేంద్రసింగ్‌ శిక్షారత్న అవార్డు అందుకున్నారు. ప్రాథమిక స్థాయిలో విద్యార్థులకు విద్యా బోధన, దస్తూరి, మౌలిక సదుపాయాల కల్పన, ఆరోగ్యం, తల్లిదండ్రులతో సమన్వయం, సాంస్కృతిక అంశాలు, క్రమశిక్షణ మొదలైన అంశాలను ప్రాతిపదికగా తీసుకుని నవాచారి గతి విద్యా సమూహ్‌ భారత్‌ సంస్థ జాతీయ ఇన్నోవేటివ్‌ శిక్షారత్న అవార్డులను ప్రకటిస్తుంది. ఈ మేరకు 2025–26వ సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 8 మంది ఉపాధ్యాయులను శిక్షారత్న అవార్డుకు ఎంపిక చేసింది. ఏలూరు శ్రీరాంనగర్‌ మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న రాజపుట్‌ నాగేంద్ర సింగ్‌ ఈ అవార్డుకు ఎంపికై న 8 మందిలో ఉన్నారు. ఆయనకు ఈ అవార్డును జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకట లక్ష్మమ్మ మంగళవారం అందచేసి అభినందించారు.

అబార్షన్లు ఆందోళనకరం 1
1/1

అబార్షన్లు ఆందోళనకరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement