స్కేటింగ్‌లో సత్తా
తణుకు అర్బన్: స్కేటింగ్‌లో సత్తాచాటి తణుకుకు చెందిన కాకిలేటి గేయ దీపిక అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై ంది. 8 ఏళ్ల వయసులోనే స్కేటింగ్‌లో కఠోర సాధన చేసి ఇంత వరకు 25 పతకాలు సాధించి సంచలనం రేకెత్తిస్తోంది. 3వ తరగతి చదువుతున్న చిన్నారి ప్రతిరోజూ తణుకు స్కేటింగ్ రేంజర్స్ అకాడమీలో శిక్షణ పొందుతూ తన ప్రతిభను చాటుతోంది. ఈవెంట్స్ ఉన్న రోజుల్లో ముందు నుంచి ఉదయం సమయంలో కూడా ప్రాక్టీస్ చేస్తుంది. అంతర్జాతీయ స్థాయికి చేరిన దీపికతో క్రీడాభిమానులు ఫొటోలు దిగి కూడళ్లలో ఫ్లెక్సీలు ఏర్పాటుచేయడం విశేషం.
పతకాల ప్రయాణమిలా..
ఈ నెల 7, 8 తేదీల్లో పూనేలో జాతీయస్థాయి ఎండ్యూరెన్స్ స్కేటింగ్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ తరపున పాల్గొన్న దీపిక అండర్–8 బాలికల విభాగంలో మూడు ఈవెంట్స్‌లో మూడు బంగారు పతకాలు సాధించి మాల్దీవుల్లో జరగనున్న అంతర్జాతీయ స్కేటింగ్ పోటీలకు అర్హత సాధించింది. ఇంతవరకు పూనే, విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి, ఏలూరు, కాకినాడ ప్రాంతాల్లో నిర్వహించిన పోటీల్లో పాల్గొని రాష్ట్ర, జిల్లా స్థాయిలో నిర్వహించిన పోటీల్లో 14 బంగారు, 7 సిల్వర్, 4 కాంస్య పతకాలు సాధించింది.
స్కేటింగ్‌లో సత్తా


