నిరుద్యోగ భృతి హామీ మరిచారు
ఎన్నికల సమయంలో ప్రతి నెలా నిరుద్యోగ భృతి రూ.3 వేలు ఇస్తామని చంద్రబాబు, కూటమి నాయకులు హామీ ఇచ్చి అధికారం దక్కించుకున్నారు. ఇప్పటివరకు మూడు బడ్జెట్లు ప్రవేశపెట్టినా నిరుద్యోగ భృతి పథకానికి ఒక్క రూపాయి కూడా కేటాయించకుండా నిరుద్యోగులను మోసం చేశారు. రాష్ట్రంలో లక్షలాది నిరుద్యోగులు భృతి కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే చదివిన చదువులకు సరిపడా ఉద్యోగాలు లభ్యం కాక యువతీ యువకులు నిరాశలో ఉన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికైనా నిరుద్యోగ భృతి హామీని ఆచరణలో పెట్టి యువతను ఆదుకోవాలి.
– ఎండీ.గాలిబ్‌బాబు, న్యాయవాది, కై కలూరు


