సహకార సంఘ ఉద్యోగుల ధర్నా | - | Sakshi
Sakshi News home page

సహకార సంఘ ఉద్యోగుల ధర్నా

Feb 22 2026 7:13 AM | Updated on Feb 22 2026 7:13 AM

సహకార సంఘ ఉద్యోగుల ధర్నా

సహకార సంఘ ఉద్యోగుల ధర్నా

కొయ్యలగూడెం : సహకార సంఘ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం కొయ్యలగూడెం డీసీసీ బ్రాంచ్‌ వద్ద శనివారం ధర్నా నిర్వహించారు. ధర్నాను ఉద్దేశించి సీఐటీయు జిల్లా ఉపాధ్యక్షుడు శుక్లబోయిన రాంబాబు మాట్లాడుతూ సొసైటీ ఉద్యోగులు సమ్మెబాట పట్టారని, ఏలూరు జిల్లాలో 122 సొసైటీలలో 415 మంది ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం న్యాయమైన డిమాండ్ల కోసం ఉద్యోగులు సమ్మెబాట పట్టారని తెలిపారు. ప్రభు త్వం సహకార సంఘ ఉద్యోగులుగా గుర్తించలేదన్నారు. పెన్షన్‌, గ్రాట్యుటీ, బీమా సౌకర్యం కల్పించాలని, వారి న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వెంటనే కలగజేసుకుని విధులకు హాజరయ్యేలా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రైతులకు అందుబాటులో సేవలు అందించాలని కోరారు. కార్యక్రమంలో కె.సత్యనారాయణ, రఘు, యర్రంశెట్టి సుబ్రమణ్యం, అడపా నాగేశ్వరరావు, రవి ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement