అర్జీలపై అలసత్వం తగదు
ఏలూరు(మెట్రో) : పీజీఆర్‌ఎస్‌లో అందిన అర్జీలపై అలసత్వం తగదని కలెక్టర్ కె.వెట్రిసెల్వి హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లాస్థాయి పీజీఆర్‌ఎస్‌లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.
అర్జీల్లో కొన్ని..
● ఆగిరిపల్లి మండలంలోని ఈదులగూడేనికి చెందిన విద్యుత్ లైన్‌మెన్ బెజవాడ రమేష్ విద్యుత్ బిల్లులు కడతామని గ్రామస్తుల నుంచి సుమారు రూ.4 లక్షలు తీసుకుని చెల్లించకుండా ఇబ్బంది పెడుతున్నారని పలువురు గ్రామస్తులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.
● గుండుగొలనులో ఏడో వార్డు పెత్తందారి వీధి నిర్మాణం చేపట్టాలని స్థానిక నిర్వాసితులు కలెక్టర్‌కు అర్జీ అందించారు.
● బుట్టాయగూడెం మండల కేంద్రంగా ఎస్టీ బాయ్స్ కాలేజీ హాస్టల్ స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాన్ని ఆపాలని విద్యార్థి, యువజన, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు.


