పూతంతా మాడిపోయింది | - | Sakshi
Sakshi News home page

పూతంతా మాడిపోయింది

Feb 23 2026 7:35 AM | Updated on Feb 23 2026 7:35 AM

పూతంత

పూతంతా మాడిపోయింది

పూతంతా మాడిపోయింది రెండేళ్లుగా నష్టాలే ఆముదంలో ముంచిన పాత చీరలు కట్టాలి

4 ఎకరాల్లో మామిడి తోట ఉండగా బంగినపల్లి, చిన్నరసాలు, సువర్ణ రేఖ రకాల చెట్లు ఉన్నాయి. ఈ ఏడాది పూత బాగా వచ్చింది. పూతను కాపాడుకునేందుకు 4 సార్లు మందులు పిచికారీ చేశాను. దీనికి రూ.60 వేలు పెట్టుబడి అయింది. అనుకోకుండా ఫిబ్రవరిలో నల్ల తామర ఆశించడంతో పూతంతా మాడిపోయింది. తోటలోకి వెళ్లాలని అనిపించడం లేదు.

వెలివల శివరామకృష్ణ, సుంకొల్లు, నూజివీడు మండలం

మామిడి పరిస్థితి దారుణంగా తయారైంది. పూతలు బాగా వచ్చినప్పటికీ తామర పురుగు వల్ల పూతంతా మాడిపోయింది. రెండేళ్లుగా నష్టాలే మిగులుతుండగా, ఈ ఏడాది కూడా నష్టాలు తప్పేలా లేవు. రెండెకరాల్లో ఉన్న చిన్న రసాల చెట్లకు 6 సార్లు మందులు పిచికారీ చేశా. రూ.30 వేలు పెట్టుబడి కాగా పెట్టుబడి వచ్చే పరిస్థితి కనబడటం లేదు.

వికృతి రాంబాబు, కొత్త ఈదర, ఆగిరిపల్లి మండలం

నల్ల తామర పురుగుల నివారణకు తోటల్లో జిగురు అట్టలు కాని, పాతచీరలను ఆముదంలో ముంచి గాలివాటంకు అనుగుణంగా తోటలలో కట్టాలి. దీంతో చీరకు అంటుకున్న నల్ల తామర పురుగులు అతుక్కుపోయి ఎగరలేవు. గతేడాది ఉన్నంత ఉధృతంగా అయితే ఈ ఏడాది లేవు. మంచు వల్ల కూడా నష్టం జరిగింది.

ఆర్‌.హేమ, ఉద్యాన అధికారి, నూజివీడు

పూతంతా మాడిపోయింది
1
1/2

పూతంతా మాడిపోయింది

పూతంతా మాడిపోయింది
2
2/2

పూతంతా మాడిపోయింది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement