పంచాయతీ కార్యదర్శిపై దాడి | - | Sakshi
Sakshi News home page

పంచాయతీ కార్యదర్శిపై దాడి

Feb 12 2026 7:30 AM | Updated on Feb 12 2026 7:30 AM

పంచాయతీ కార్యదర్శిపై దాడి

పంచాయతీ కార్యదర్శిపై దాడి

బుట్టాయగూడెం : ఇంటి పన్ను కట్టమని అడిగినందుకు పంచాయతీ కార్యదర్శిపై ఒక వ్యక్తి దాడి చేశాడు. దీనిపై బుధవారం రాత్రి కార్యదర్శి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దొరమామిడి గ్రామ పంచాయతీ కార్యదర్శి గుండేపల్లి సోమరాజు బుధవారం సాయంత్ర సిబ్బందితో కలిసి ఇంటి పన్నులు వసూలు చేసేందుకు వెళ్లారు. గ్రామంలోని ఒక టీస్టాల్‌ వద్ద పవన్‌కుమార్‌ అనే వ్యక్తిని ఇంటి పన్ను చెల్లించమని అడుగగా ఆ వ్యక్తి వివాదస్పదంగా మాట్లాడినట్లు కార్యదర్శి తెలిపారు. అసభ్య పదజాలంతో మాట్లాడుతూ పలుమార్లు తనపై దాడి చేసి కొట్టినట్లు కార్యదర్శి చెప్పారు. విధి నిర్వహణలో ఉన్న తనపై దాడి చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయ్యాలని కోరుతూ స్థానిక పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేశారు. కార్యదర్శి సోమరాజుపై జరిగిన దాడిని డిప్యూటీ ఎంపీడీఓ, వీఎస్‌ఎస్‌ శ్రీనివాసరావు, కార్యదర్శిలు రామకృష్ణ, కిరణ్‌, తదితరులు తీవ్రంగా ఖండించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement